Monday, December 23, 2024

యూపి విద్యార్థిపై దాడి కేసు.. దర్యాప్తు నివేదిక కోరిన సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ఖుబ్బాపూర్ గ్రామంలో ముస్లిం విద్యార్థినిపై తోటి విద్యార్థులచే టీచర్ దాడి చేయించిన కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు బుధవారం ముజఫర్‌నగర్ పోలీస్ సూపరింటెండెంట్‌ను కోరింది. ఆ విద్యార్థికి, తల్లిదండ్రులకు ఎంతవరకు రక్షణ కల్పించారో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక సమర్పించాలని జస్టిస్‌లు అభయ్ ఎస్ ఓకా, పంకజ్ మిథాల్ తో కూడిన ధర్మాసనం ఎస్‌పిని కోరింది.

దీనిపై సెప్టెంబర్ 25 నాటికి సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని కోరుతూ మహాత్మాగాంధీ మనుమడు తుషార్ గాంధీ సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. హోమ్ వర్క్ చేయలేదని రెండో తరగతి ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులచే టీచర్ త్రిప్త త్యాగి దాడి చేయించారనే ఆరోపణలు రావడమే కాక, ఈ సంఘటన వీడియో వైరల్ అయింది. దీనిపై రాష్ట్ర విద్యావిభాగం ఆ స్కూలుకు నోటీస్ జారీ చేసింది. వీడియో వైరల్ అయిన మరునాడు టీచర్‌పై కేసు నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News