తమిళనాడు ప్రభుత్వం సంచలన
నిర్ణయం గవర్నర్ వద్ద
పెండింగ్‌లో ఉన్న పది బిల్లులకు
చట్టరూపం సుప్రీంకోర్టు తీర్పు
నేపథ్యంలో డిఎంకె సర్కార్
దూకుడు బిల్లులను సుదీర్ఘకాలం
పెండింగ్‌లో పెట్టే అధికారం
గవర్నర్లకు లేదని ఇటీవలే
చెప్పిన సుప్రీంకోర్టు
చెన్నై: పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన వేళ , తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లే కుండానే రాష్ట్ర ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. ఈమేర కు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. శాసనసభ ఆమోదించిన బిల్లుల ను గవర్నర్ ఆర్‌ఎన్ రవికి పంపగా, ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తనవద్దనే ఉంచేసుకుంటున్నారని తమిళనాడు ప్ర భుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై 2023లో సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది. బిల్లుల్ని సమ్మతించక పోవడం, పునః పరిశీలించాల ని సూచిస్తూ వెనక్కి కూడా పంపడం లేదని తెలిపింది.
రెండోసారి ఆమోదించిన బిల్లుల విషయంలోనూ ఆయన తీరు మారలేదంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంపై ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. గవర్నర్ కాలనిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రిమండలి సలహామేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని , రాజ్యాంగం లోని 200 వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదంది. గవర్నర్ తీరును సుప్రీం కోర్టు తప్పుపడుతూ ఆ 10 బిల్లులకు మార్చి 8న క్లియరెన్స్ ఇచ్చింది. సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అభివర్ణించారు.