Thursday, January 23, 2025

1996 లజ్‌పత్ నగర్ బాంబు పేలుళ్ల కేసు: నలుగురికి జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 1996 నాటి లజ్‌పత్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషులు నలుగురికి సుప్రీం కోర్టు గురువారం జీవితఖైదు విధించింది. ఈ కేసులో నేర తీవ్రత ఉదహరిస్తూ శిక్షలో ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేసింది. ఈ బాంబు పేలుళ్లలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది గాయపడ్డారు. ఈ కేసు విచారణలో జాప్యానికి జస్టిస్‌లు బిఆర్ గవాయి, విక్రమ్‌నాథ్, సంజయ్ కరోల్‌తో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారం వెలిబుచ్చింది. ధర్మాసనం ఇలాంటి కేసులను త్వరిత గతిని విచారించాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా సామాన్యులకు జాతీయ భద్రత దృష్టిలో అవసరమని అభిప్రాయపడింది.

దోషులు మొహమ్మద్ నౌషద్, మిర్జా నిస్సార్ హుస్సేన్, మొహమ్మద్ అలీ భట్, జావేద్ అహ్మద్ ఖాన్ లకు జీవిత ఖైదు శిక్ష పడింది. అమాయక ప్రజల మరణానికి దారి తీసిన ఈ నేరం తీవ్రత, దోషుల పాత్ర, ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని విధించిన జీవితఖైదు ఎలాంటి మిన హాయింపులు లేకుండా వారు చనిపోయేవరకు కొనసాగాల్సిందేనని తీర్పులో పేర్కొన్నారు. దోషులు ప్రస్తుతం బెయిలుపై ఉన్నట్టయితే తక్షణం కోర్టుకు లొంగిపోవాలని, వారి బెయిల్ బాండ్లు రద్దు చేయడమైందని ధర్మాసనం వివరించింది. 1996 మే 21సాయంత్రం లజ్‌పత్‌నగర్ మార్కెట్ లో సంభవించిన బాంబు పేలుళ్లు మొత్తంమార్కెట్‌ను అల్లకల్లోలం చేసింది. 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News