Sunday, January 19, 2025

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం సీరియస్

- Advertisement -
- Advertisement -

కోర్టుకు చెప్పకుండా ఆంక్షలు సడలించొద్దని ఆదేశం

న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంపై సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలదీసింది. దేశ రాజధానిలో గాలి నాణ్యతను పెంచేలా నిబంధనలు అమలు లోకి తీసుకురావాలని దాఖలైన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌లతో కూడిన బెంచ్ విచారణ జరిపింది. “ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటే వరకు మనం ఎందుకు ఎదురు చూడాలి? అని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ సమయంలో తమకు చెప్పకుండా జీఆర్‌పీఏ 4 ( గ్రాండ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్)లో ఎటువంటి సడలింపులూ ఇవ్వవద్దని ఢిల్లీ సర్కారుకు తెలిపింది. ఏక్యూఐ 400 స్థాయి కంటే దిగువకు చేరినా , స్టేజి 4 నిబంధనల అమలు ఆపొద్దని చెప్పింది.

ఈ సీజన్‌లో తొలిసారి ఢిల్లీలో వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయి (సివియర్ ప్లస్)కి చేరింది. దీంతో ప్రభుత్వం జీఆర్‌పీఏ 4 అమలు లోకి తీసుకురావాల్సి వచ్చింది. ది సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చి (సఫర్)డేటా, ఏక్యూ సూచీ ప్రకారం నగరం లోని 481 స్థాయి దాటి పోయింది. 35 కేంద్రాల్లో చాలా చోట్ల 400 కంటే అధికంగా నమోదైంది. ద్వారకాలో ఏకంగా 499 నమోదైంది. సోమవారం ఉదయం కమ్ముకున్న పొగమంచుతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.

గాలిలో ప్రాణాంతక కాలుష్య కారకాల స్థాయిని కొలిచే పీఎం 2.5 సూచీ అత్యధిక స్థాయికి చేరిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరేవరకు కేంద్ర ప్రభుత్వం అచేతనంగా ఉందని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైందని సీఎం ఆతిశీ ఆరోపించారు. పొరు గు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలు దహనం చేస్తు న్నా, చర్యలు తీసుకోవడం లేదన్నారు. మరోవైపు ఢిల్లీలో సోమవారం గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 481 కి చేరిందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News