- Advertisement -
న్యూఢిల్లీ: పోలీసులు అధికార పార్టీలకు కొమ్ముకాస్తున్నారని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలీసుల తీరుపై సిజెఐ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దేశంలో పోలీసుల తీరు ఇబ్బందికరంగా మారిందని, అధికారం ఉన్న వైపే పోలీసులు పని చేస్తున్నారని అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. ఇలాంటి సంప్రదాయానికి తెరపడాల్సిన అవరసం ఉందని అభిప్రాయపడింది. అధికారం మారగానే కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటున్నారని, ఐపిఎస్ గుర్జిందర్ పాల్ సింగ్ ను అరెస్టు చేయవొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారకు సహకరించాలని ఐపిఎస్ అధికారికి సూచింది. దీనిపై నాలుగు వారాల్లో నివేదిక అందజేయాలని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
Supreme Court Serious comments on Police Department
- Advertisement -