Saturday, February 1, 2025

ఎంత టైమ్ కావాలి?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ మారిన ఎంఎల్‌ఎలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జ రిగింది. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బిఆర్ గ వాయ్, జస్టిస్ జార్జి మైస్‌లతో కూడిన ధర్మా నం విచారణ జరిపింది. హైకోర్టు నాలుగు నె లల్లో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని గ త ఏడాది మార్చిలో చెప్పినా ఇంత వరకు ని ర్ణయం తీసుకోలేదని కౌషిక్‌రెడ్డి తరపు న్యా యవాది కోర్టు దృష్టికి
తీసుకెళ్లారు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని న్యాయవాది తెలిపారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎంఎల్‌ఎలకు నోటీసులు ఇచ్చామని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు చెప్పారు. నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ ఎంఎల్‌ఎలకు ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రోహత్గి గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? రీజనబుల్ టైమ్ అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా ?’ అంటూ తెలంగాణ స్పీకర్‌ను సుప్రీం ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.

స్పీకర్‌ను అడిగి నిర్ణయం చెపుతామని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఎంత సమయం కావాలో మీరే స్పీకర్‌ను కనుక్కొని చెప్పాలని రోహత్గికి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌లు కడియం శ్రీహరి, దానం నాగేందర్ , తెల్ల వెంకటరావుపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద ఈ పిటిషన్ దాఖలు చేశారు. బిఆర్‌ఎస్‌పై గెలిచిన కాంగ్రెస్ పార్టీలోకి కడియం, దానం నాగేందర్ , తెల్ల వెంకటరావు సహా పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దీనిపై జస్టిస్ బి ఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలు తెల్లం, కడియం, దానంపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. బిఆర్‌ఎస్ నుంచి నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎంఎల్‌లకు తెలంగాణ స్పీకర్ కనీసం నోటీసు ఇవ్వలేదని పిటిషన్‌లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News