Friday, January 24, 2025

విద్వేష ప్రసంగాలపై సుప్రీం సీరియస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: విద్వేషపూరిత ప్రసంగాలపై తక్షణమే స్వయంగా కేసులు నమోదు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుల నమోదు లో ఆలస్యం చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తా మని హెచ్చరించింది. ఎవరైనా విద్వేషపూరితం గా ప్రసంగించినప్పుడు వారిపై ఇతరులు స్పం దించి ఫిర్యాదు చేయకపోయినప్పటికీ పోలీసు లు స్వయంగా కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది. 2022లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరా ఖండ్ రాష్ట్రాల పోలీసులకు ఈ అంశంపై ఇచ్చిన ఆదేశాలను శుక్ర వారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిం పజేస్తున్నట్లు పేర్కొంది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దాఖలయిన పిటి షన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. దేశంలోని లౌకికవాద వ్యవస్థను ప్రభావితం చేసే సత్తా విద్వేషపూరిత ప్రసంగాలకు ఉందని, ఇది చాలా తీవ్రమైన నేరమని పేర్కొంది. విద్వేష పూరిత ప్రసంగం చేసిన వారిపై చర్యలు తీసు కోవడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైం దని ఆరోపిస్తూ దాఖలయిన పిటిషన్‌పై న్యా యస్థానం అంతకు ముందు విచారించింది.

దీనిపై స్పందించాలని ఆ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న లౌకికవాద లక్షణాన్ని కాపాడడం కోసం , విద్వేష ప్రసంగం చేసిన వారి మతం ఏదయినప్పటికీ ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయాలని జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా ప్రతి రాష్ట్రానికి ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు. అయితే ప్రతి జిల్లాకు ఒకరిని నియమించాలని ధర్మాసనం సూచించింది. విద్వేష ప్రసంగాలను సామాజిక మాధ్యమాలనుంచి తొలగించడం కోసం ప్రత్యేకంగా ఒక విధానాన్ని రూపొందించాలని పిటిషనర్లు కోరారు. విద్వేషపూరితంగా మాట్లాడినందుకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, మరికొందరిపై కేసులు నమోదు చేయాలని పిటిషనర్లు కోరారు. దీనిపై జస్టిస్ జోసెఫ్ స్పందిస్తూ సెక్షన్ 156(3) ప్రకారం కేసు నమోదు చేయాలంటే అనుమతి అవసరమని మేజిస్ట్రేట్, హైకోర్టు చెప్పినట్లు గుర్తు చేశారు. న్యాయమూర్తులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారన్నారు.

వారికి ఫలానా పార్టీతో సంబంధం ఉండదన్నారు.వారి దృష్టిలో ఉండేది కేవలం భారత రాజ్యాంగమేనని తెలిపారు. విశాల ప్రజాహితం దృష్టా చట్టబద్ధ పాలన అమలయ్యేలా చూడడం కోసం విచారణను చేపడుతున్నట్లు తెలిపారు. కాగా కోర్టు ఆదేశాలను రాష్ట్రప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం లేదని, విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై చర్యలు తీసుకొంటుందని విచారణ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు తెలిపారు. కేంద్రమైనా, రాష్ట్రప్రభుత్వమైనా విద్వేష ప్రసంగాలను తేలిగ్గా తీసుకోదని కేంద్రం తరఫున హాజరయిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి తెలియజేశారు. అయితే పిటిషన్లు దాఖలయినప్పుడల్లా కోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై జస్టిస్ నాగరత్న స్పందిస్తూ తాము స్థూల మార్గదర్శకాలను ఇచ్చామని, వాటిపై స్పందించాల్సిన బాధ్యత ఇక అధికారులదేననిపేర్కొన్నారు. ప్రతి సంఘటనను తాము పర్యవేక్షించలేమని కూడా న్యాయమూర్తి స్పష్టం చేశారు. కేసు తదుపరి విచారణ మే 12న జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News