Monday, December 23, 2024

‘నీట్’ వివాదంపై సుప్రీం కోర్టు సీరియస్

- Advertisement -
- Advertisement -

పరీక్ష నిర్వహణలో ఎక్కడైనా 0.001 % నిర్లక్ష్యం ఉన్నా…దానిని సకాలంలో పరిష్కరించాలని, పరీక్షల నిర్వహణ ఏజెన్సీ ఎన్ టిఏ కు సుప్రీంకోర్టు ఆదేశించింది.

న్యూఢిల్లీ:  వైద్య విద్యా కోర్సు ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీ జరిగాయన్న వార్తలున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు మండిపడింది.  ఎక్కడైనా 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా… దానిని సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేసింది.

‘‘న్యాయంగా వ్యవహరించాలి. తప్పు జరిగితే అంగీకరించాలి. ఫలానా చర్యలు తీసుకున్నాం అని వివరించాలి. కనీసం అదైనా మీ పనితీరుపై విశ్వాసం కలిగిస్తుంది’’ అని సుప్రీంకోర్టు ,  జాతీయ పరీక్ష మండలి( ఎన్ టిఏ)కు తెలిపింది. వైద్య విద్య ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు ఎంత కఠినంగా శ్రమిస్తారో మరచిపోకూడదని పేర్కొంది.

ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ‘నీట్’ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ఎస్ విఎన్ భట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. సకాలంలో ఎన్ టిఏ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News