Monday, December 23, 2024

ఎగవేతల రాష్ట్రాలూ.. 8లోగా జడ్జిల బకాయిలు చెల్లించాలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దిగువ కోర్టుల జడ్జిలకు రావాల్సిన బకాయిలు ఇప్పటివరకూ చెల్లించని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఎగ్గొట్టే బాపతు రాష్ట్రాలు వెంటనే ఆయా న్యాయమూర్తులకు వేతన బకాయిలు ఇతరత్రా పెండింగ్ చెల్లింపులు జరిపించి తీరాలని స్పష్టం చేశారు. ఇందుకు చివరి గడువు ఇస్తున్నామని, వచ్చేనెల 8వ తేదీలోగా వీటిని చెల్లించాల్సి ఉందని స్పష్టం చేశారు. రెండవ జాతీయ జుడిషియల్ పే కమిషన్ సిఫార్సుల (ఎన్‌ఎన్‌జెపిసి) మేరకు దిగువ కోర్టుల న్యాయమూర్తులకు వేతన, భత్యాల చెల్లింపులు చాలా రాష్ట్రాలలో జరగాల్సి ఉంది.

జిల్లాల న్యాయవ్యవస్థలలో పనిచేసే న్యాయమూర్తుల వేతన, పింఛన్, భత్యాలు, కుటుంబ పెన్షన్ విషయాల గురించి జుడిషియల్ పే కమిషన్ తగు విధంగా స్పందించింది. పైగా జిల్లా జుడిషియరీలో ఉద్యోగ భద్రత, వారి సేవల దశలో పరిస్థితుల గురించి కూడా దృష్టి సారించింది. తగు విధంగా వీరి వేతన భత్యాల పెంపుదల సిఫార్సులు చేసింది. అయితే ఇప్పటికీ వీటి చెల్లింపులు, వీరికి సరైన విధంగా పరిస్థితులు కల్పించడంలో పలు రాష్ట్రాలు చిత్తశుద్ధి కనపర్చలేదు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం స్పందించింది.

సంబంధిత విషయంపై ఈ ఏడాది మే నెల 19వ తేదీన తగు విధంగా సంబంధిత రాష్ట్రాలకు ఆదేశాలు వెలువరించినట్లు, అయితే ఇప్పటివరకూ ఎటువంటి స్పందన లేకుండా వ్యవహరిస్తున్నందున దీనిని తీవ్రంగా పరిగణించాల్సి వస్తోందని న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, మనోజ్ మిశ్రా కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం తెలిపింది. న్యాయవ్యవస్థకు జిల్లా న్యాయవ్యవస్థ వెన్నెముక వంటిది. వేతన కమిషన్ సిఫార్సుల మేరకు బకాయిల చెల్లింపులు జరగాల్సి ఉందని తాము వెలువరించిన ఆదేశాల బేఖాతరును ఏ విధంగా పరిగణించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News