Monday, December 23, 2024

రెండు వేళ్ల పరీక్షపై సుప్రీంకోర్టు సీరియస్

- Advertisement -
- Advertisement -

 

Supreme Court Shock to AP Govt over Polavaram న్యూఢిల్లీ: అత్యాచార బాధితులను పరీక్షించేందుకు రెండు వేళ్ల పరీక్ష ఇప్పటికీ సమాజం నుంచి తొలగిపోకపోవడంపై సుప్రీంకోర్టు సోమవారంనాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే రెండు వేళ్ల పరీక్ష జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.

అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన ఓ వ్యక్తిని జార్ఖాండ్ హైకోర్టు నిర్దోషిగా విడిచిపెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని డివిజన్ బెంచ్ తోసిపుచ్చుతూ, దోషిగా నిర్ధారించిన ట్రయిల్ కోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది. ఈ సందర్భంగా, రెండు వేళ్ల పరీక్షలపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచార నిర్ధారణకు వైద్యులు ‘రెండు వేళ్ల’ పరీక్షను నిర్వహించడం అత్యంత అమానవీయమని, ఈ పరీక్ష బాధితుల గోప్యతా హక్కుకు తీవ్ర భంగకరమని పేర్కొంటూ 2013 మేలో సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ విషయాన్ని న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం ప్రస్తావిస్తూ, ఇప్పటికీ సమాజంలో ఏదో ఒక చోట ఇలాంటివి చోటుచేసుకుంటుండటం దురదృష్టకరమని పేర్కొంది. లైంగికంగా చురుకుగా ఉన్న మహిళ అత్యాచారానికి గురికాదని చెప్పలేమని అభిప్రాయపడింది. రెండు వేళ్ల పరీక్షల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ధర్మాసనం కొన్ని మార్గదర్శకాలను సూచించింది. టు ఫింగర్స్ టెస్ట్ జరక్కుండా చూడాలంటూ ఆయా రాష్ట్రాల డీజీపీలు, హెల్త్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగతంగా ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడినా అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్టుగా నిర్ధారించి, వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. అలాగే, టూ ఫింగర్స్ పరీక్షలకు సంబంధించిన విద్యా విషయక సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల పాఠ్యాంశాల నుంచి తొలగించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News