Sunday, February 2, 2025

రాందేవ్ పతంజలికి సుప్రీం కోర్టు తీవ్ర హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేదకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆధునిక వైద్య విధానాన్ని , అల్లోపతి ఔషధాలను టార్గెట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు ప్రకటనలను నిలిపివేయాలని ఆదేశించింది. లేదంటే భారీ జరిమానా తప్పదని సుప్రీం మంగళవారం ఆదేశించింది. ప్రతీ తప్పుడు క్లెయిమ్‌కు గరిష్టంగా రూ. కోటి వరకు జరిమానా తప్పదని హెచ్చరించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News