Thursday, January 23, 2025

మణిపూర్ సిబిఐ కేసులు గువాహటిలో విచారణ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపుర్ హింసాత్మక ఘటనలకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తోన్న కేసులను సుప్రీంకోర్టు అస్సాంకు బదిలీ చేసింది. ఇక నుంచి ఈ కేసుల విచారణ అస్సాంలోనే కొనసాగనుందని తెలిపింది. ఇందుకోసం ఒకరు లేదా అంతకంటే ఎక్కువ న్యాయమూర్తులను ఎంపిక చేయాలని గువాహటి హైకోర్టుకు సూచించింది. మణిపుర్ హింసపై నమోదైన కేసులను స్థానికంగా కాకుండా పొరుగు రాష్ట్రంలో విచారించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మణిపూ-ర్‌కు సంబంధించిన పిటిషన్లపై సిజెఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ చేపట్టింది.

సిబిఐ దర్యాప్తు క్రమంలో నిందితులను కోర్టుముందు హాజరు పరచడం, రిమాండు, జ్యుడీషియల్ కస్టడీ వంటివి ఇక నుంచి గువాహటిలో కేటాయించిన కోర్టు నుంచి ఆన్‌లైన్‌లోనే విచారణ జరుగుతాయని పేర్కొంది. ఒకవేళ జ్యుడీషియల్ కస్టడీ విధిస్తే మాత్రం రవాణా ఇబ్బందుల దృష్ట్యా దాన్ని మణిపుర్‌లోనే జరిగేలా చూస్తామని తెలిపింది. ఈ కేసులతో సంబంధమున్న బాధితులు, సాక్షులతోపాటు ఇతరులు ఎవరైనా ఆన్‌లైన్‌లో ఇష్టం లేకుంటే నేరుగా గువాహటిలోని కోర్టు ముందు హాజరుకావచ్చని తెలిపింది. సిబిఐ కేసుల విచారణ సజావుగా సాగేందుకు వీలుగా ఇంటర్నెట్ సేవలను సమకూర్చాలని మణిపుర్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News