Thursday, December 19, 2024

అమరావతిపై ఎపి సర్కారు సుప్రీంలో చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఓ కేసు విచారణలో ఉండగా దానిని మధ్యలో ఆపేసి మరో కేసును ఎలా విచారిస్తామని జస్టిస్ కేఎం జోసెఫ్ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై అసహనం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అలా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించారు.జులై 11న కేసు విచారణ జులై 11న చేపడతామని కేసు విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న స్పష్టం చేశారు.

రాజధానికి సంబంధించిన అమరావతి పిటిషన్‌ను వెంటనే విచారించాలన్న ఎపి తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని ఆయన నిరాకరించారు. పిటిషన్ వేసిన వారిలో కొందరు రైతులు చనిపోయారని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. మృతుల తరఫు ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు అనుమతి కోరగా.. అందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. నోటీసులు పంపాలని ప్రభుత్వ న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది.అమరావతి రాజధాని కేసు విచారణ సందర్భంగా.. జస్టిస్ కేఎం జోసెఫ్ గతంలో మాట్లాడుతూ.. రాజధాని కేసు చేపడితే సార్థకత ఉండాలని, రాజ్యాంగపరమైన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News