Sunday, January 19, 2025

సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.తనను ఇడి అరెస్టు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇడి అరెస్టు చేయడంపై అత్యవసరంగా విచారణ చేప్టటాలని కేజ్రీవాల్ న్యాయవాది న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఎమర్జెన్సీగా ఈ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం అంగికరించలేదు. పిటిషన్ ను  పరిశీలించి.. ఎప్పుడు విచారణ ఉుంటుందనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని తేల్చి చెప్పింది. దీంతో సుప్రీంలోనూ కేజ్రీవాల్ కు షాక్ తగిలినట్లైంది.

ఇక, లిక్కర్ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. కేజ్రీవాల్ అరెస్టులో చట్ట నిబంధనల ఉల్లంఘన ఏమీ జరగలేదని కోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News