Sunday, November 3, 2024

ఉద్దవ్ థాకరేకి సుప్రీంకోర్టు షాక్

- Advertisement -
- Advertisement -

Supreme Court shock to Uddhav Thackeray

ఉద్దవ్ థాకరేకి సుప్రీంకోర్టు షాక్
పార్టీ గుర్తింపు, చిహ్నంపై ఉద్దవ్ పిటిషన్ కొట్టివేత
నిజమైన శివసేనగా షిండే వర్గం వాదన వినేందుకు ఈసికి అనుమతి
న్యూఢిల్లీ: మాజీ సిఎం ఉద్దవ్ థాకరేకి సుప్రీంకోర్టు ఇచ్చింది. షిండే వర్గాన్ని కాదని తమదే నిజమైన శివసేనగా ఈసి గుర్తించాలని వాదిస్తున్న ఉద్దవ్ వర్గానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అసలు వర్గమనేది ఎన్నికల ఆదేశించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. షిండే వర్గం వాదన వినేందుకు ఈసిని అనుమతించింది. దీంతో మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన తిరుగుబాటు వర్గం ఆ పార్టీ గుర్తు బాణం, విల్లును సొంతం చేసేందుకు మార్గం సుగమం అయింది. జస్టిస్ డివై ధర్మాసనం థాకరే వినతిని తిరస్కరించింది. నిజమైన శివసేన ఎవరిదనేది తేల్చే విషయంలో ఎన్నికల విచారణ ప్రక్రియపై స్టే విధించడంలేదని..జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ఎంఆర్ కృష్ణమురళి, పిఎస్ నరసింహాతో కూడిన బెంచ్ తెలిపింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఉద్దవ్ వర్గం తరఫున వాదనలు వినిపించారు. శివసేన పార్టీ గుర్తు కోసం షిండే వర్గం సంఘాన్ని హూడైశయించడాన్ని కపిల్ సిబల్ సవాల్ చేశారు. అయితే వర్గం వాదనను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది డాటార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌కు మెజార్టీ సభ్యుల ఆధారంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉందని తెలిపారు. సొలిసిటర్ జనరల్ మెహతా మహారాష్ట్ర గవర్నర్ బిఎస్ కొషియారీ తరఫున ఏ వర్గం నిజమైన శివసేన అనేది కమిషన్ మాత్రమే నిర్ణయించగలదని, షిండే అభ్యర్థనపై ఈసి నిర్ణయం తీసుకునేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరారు.

కాగా శివసేనగా తిరుగుబాటు నేత, మహారాష్ట్ర షిండేవర్గాన్ని ఈసి ఆదేశించాలని ఉద్దవ్ థాకరే వర్గం సుప్రీంకోర్టును కోరినా ఫలితం దక్కలేదు. పార్టీ గుర్తును షిండే వర్గానికి కేటాయించొద్దని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన ఉద్దవ్ వర్గం శివసేన తిరుగుబాటు ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాల్సిందిగా సుప్రీం ధర్మాసనానికి విన్నవించింది. సుప్రీంకోర్టు థాకరే వినతిని ఆమోదించి ఉంటే షిండే ప్రభుత్వం చిక్కుల్లో పడేది. అనర్హతకుగురైన ఎంఎల్‌ఎలు పార్టీ గుర్తును తమకు కేటాయించాల్సిందిగా కోరేందుకు అవకాశం ఉండేదికాదు. అయితే పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు తాము షిండేవర్గాన్ని ఈసి గుర్తించొద్దని ఆదేశించలేమని తెలిపి పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాకరే కుమారుడు ఉద్దవ్ థాకరే సారథ్యంలోనిప్రభుత్వం గత జూన్‌లో కుప్పకూలిపోయింది. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సిఎం పదవిని అధిష్ఠించారు. జూన్ 30న షిండే సిఎంగా ప్రమాణస్వీకారం చేయగా బిజెపికి చెందిన మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సిఎంగాప్రమాణం చేశారు. హూడైకమంలో థాకరే వర్గం ఆశ్రయించింది. ప్రత్యక్ష ప్రసారం జరిగిన విచారణలో నిజమైన శివసేన, ఆ పార్టీ గుర్తుపై ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం వాదనపై ఈసి నిర్ణయం తీసుకోకుండా ఆపలేమని సుప్రీం ధర్మాసనం తెలిపి థాకరే వర్గం పిటిషన్‌ను కొట్టివేసింది.

Supreme Court shock to Uddhav Thackeray

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News