Friday, December 20, 2024

నామినేషన్ తిరస్కరణపై విచారణ చేపట్టలేం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నామినేషన్ పత్రాల తిర్సకరణను సవాలు చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడం మొదలుపెడితే గందరగోళం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. బీహార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నామినేషన్ల తిరస్కరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు రావడం కన్నా అక్కడే న్యాయం పొందేందుకు ప్రయత్నించాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దీవాలాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్‌కు స్పష్టం చేసింది.

రాజ్యాంగంలోని 32వ అధికరణ కింద మేము వీటిని విచారణకు స్వీకరించడం ప్రారంభిస్తే తీవ్ర గందరగోళం ఏర్పడుతుందని ధర్మాసనం పేర్కొంది. బీహార్‌లోని బంకా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం కోసం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ద౪ఆఖలు చేసి తిరస్కరణకు గురైన జవాహర్ కుమార్ ఝా అనే వ్యక్తి తరఫున వాదించిన న్యాయవాది అలోక్ శ్రీవాస్తవకు తగిన న్యాయ పరిష్కారం పొందేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

ఈ పిటిషన్‌పై నోటీసులు ఇచ్చి విచారణను చేపట్టినప్పటికీ ఎన్నికలు మగిసిపోతాయని ధర్మాసనం తెలిపింది. ఎన్నికల చట్ట నిబంధనలను పాటించాలని పిటిషనర్‌కు కోర్టు హితవు చెప్పింది. చట్ట ప్రకారం న్యాయం పొందేందుకు ఉన్న మార్గాలను పరిశీలించాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. నామినేషన్ పత్రాల తిరస్కరణలో రిట్నిరంగ్ అధికారుల ఏకపక్ష, సర్వాధికారాలను పిటిషనర్ సవాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News