Thursday, January 23, 2025

రోడ్లను దిగ్బంధించిన కేసులో సిద్ధరామయ్యకు సుప్రీంలో ఊరట

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వపాలన కాలంలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టినప్పుడు రోడ్లను దిగ్బంధించి ప్రజలకు అసౌకర్యం కలిగించారంటూ నమోదైన కేసులో కర్ణాటక సిఎం సిద్ధరామయ్యకు సుప్రీం కోర్టు నుంచి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతోసహా ఇతరులపై జరుగుతోన్న విచారణపై సుప్రీం కోర్టు స్టే విధించింది. అలాగే హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేసింది. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే ఎస్ ఈశ్వరప్ప తన గ్రామంలో చేసిన పనులకు 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారని ఆరోపిస్తూ.. సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం కలిగించింది.

దీనిపై అప్పటి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నివాసాన్ని ముట్టడించడానికి సిద్ధ రామయ్యతోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలు మార్చ్ చేపట్టగా, రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ పోలీస్‌లు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలన్న సిఎం సిద్ధరామయ్య అభ్యర్థనను ఆ రాష్ట్ర హైకోర్టు తోసిపుచ్చింది. ప్రజా ప్రతినిధులు కూడా నిబంధనలు పాటించాలని సూచించింది. అలాగే రూ.10 వేల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో సుప్రీం నుంచి తాజా ఆదేశాలు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News