Friday, November 8, 2024

రిలయన్స్-ఫ్యూచర్ డీల్‌పై స్టే..

- Advertisement -
- Advertisement -

రిలయన్స్- ఫ్యూచర్ డీల్‌పై స్టే
అమెజాన్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు
రూ.1.3 లక్షల కోట్లు తగ్గిన రిలయన్స్ మార్కెట్ క్యాప్
న్యూఢిల్లీ: బిలియనీర్ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్-రిలయన్స్ రిటైల్ ఒప్పందం కేసులో సుప్రీంకోర్టు అమెజాన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇరు సంస్థల రూ.24,731 కోట్ల విలువచేసే ఒప్పందంపై కోర్టు స్టే విధించింది. ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఆస్తులను కొనుగోలు చేయడానికి రిలయన్స్ డీల్ ముందు సాగబోదని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఫ్యూచర్, రిలయన్స్ సంస్థలు సింగపూర్ కోర్టు తీర్పు భారతీయ చట్టాలకు లోబడి లేదని వాదించాయి. కానీ ఫ్యూచర్ రిటైల్ అమ్మకాలను నిలిపివేయాలన్న సింగపూర్ కోర్టు నిర్ణయాన్ని అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు తీర్పుతో బిఎస్‌ఇలో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 2 శాతం పడిపోయింది. షేరు విలువ పతనం కావడంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.1.3 లక్షల కోట్లు తగ్గి రూ.13.47 లక్షల కోట్లకు తగ్గింది. ఇది మార్కెట్ ముగింపు సమయంలో రూ.14.77 లక్షల కోట్ల వద్ద ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెజాన్ సుప్రీం కోర్టులో ఫ్యూచర్ గ్రూప్‌నకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఆస్తులను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించడాన్ని సవాలు చేసింది. ఇరు సంస్థలు ఈ తీర్పుపై స్పందించలేదు.
గతేడాదిలో రిలయన్స్, ఫ్యూచర్ డీల్
గతేడాది 2020 ఆగస్టులో రిలయన్స్, ఫ్యూచర్ రిటైల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించింది. 2020 అక్టోబర్ 25న సింగపూర్ కోర్టు కూడా ఈ డీల్‌ను నిలిపివేసింది. సింగపూర్ కోర్టు ఆదేశాన్ని అమలు చేయాలని అమెజాన్ ఢిల్లీ హైకోర్టుకు అప్పీల్ చేయడానికి కారణం ఇదే. 2020 నవంబర్ 20న రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదించింది.
ఫ్యూచర్ కూపన్స్‌లో అమెజాన్‌కు 49% వాటా
2019 ఆగస్టులో ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటాను అమెజాన్ కొనుగోలు చేసింది. దీని కోసం అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్‌కు రూ.1,431 కోట్లు చెల్లించింది. ఫ్యూచర్ రిటైల్‌లో ఫ్యూచర్ కూపన్‌లకు 10 శాతం వాటా ఉంది. అంటే అమెజాన్ ఫ్యూచర్ రిటైల్‌లో డబ్బు పెట్టుబడి పెట్టడం ప్రారంభించింది. ఫ్యూచర్ రిటైల్ అడగకుండానే రిలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుందని, నిబంధనలను ఉల్లంఘిస్తోందని అమెజాన్ ఆరోపించింది. సింగపూర్ కోర్టు ఈ ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత ఢిల్లీ కోర్టు వెళ్లడం, ఆ తర్వాత సుప్రీం కోర్టులో తుది తీర్పు వచ్చింది.

Supreme Court stay order on Reliance-Future deal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News