న్యూఢిల్లీ : వివాదాస్పద వక్ఫ్ చట్టంలోని కొన్ని భాగాల అమలుపై సు ప్రీంకోర్టు పాక్షికంగా స్టే విధించింది. వక్ఫ్ బోర్డులు, కౌన్సిల్ లో కొత్త ని యామకాలను తదుపరి విచారణ తే దీ మే 5 వరకూ సుప్రీంకోర్టు నిలిపి వేసింది. ప్రస్తుతానికి వ క్ఫ్ బోర్డులలో మార్పులు ఉండవు అలాగే మే 5 వరకూ వక్ఫ్ బై యూ జర్ నిబంధనను డీ నోటిఫై చేయకూడదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా ఆధ్వర్యంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డులకు ఎటువంటి నియామకాలను చేపట్టబోమని కేంద్రప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చింది.
కొత్త చట్టం వక్ఫ్ బోర్డు సభ్యుల కూర్పులో మార్పులకు వీలు కల్పించింది. అలాగే ముస్లింలు కాని వారిని సభ్యులుగా చేయడం తప్పని సరి అని నిర్దేశిస్తోంది. 2025 వక్ఫ్ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు పేర్కొన్న తదుపరి విచారణ తేదీ వరకూ బోర్డులేదా కౌన్సిల్ లకు ఎటువంటి నియామకాలు చేపట్టబోరని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హామీ ఇచ్చారు. నోటిఫికేషన్ ద్వారా, లేదా గెజిట్ ద్వారా ఇప్పటికే ప్రకటించిన వక్ఫ్ బై యూజర్ తో సహా వక్ఫ్ స్థితిలో ఎటువంటి మార్పులు ప్రభుత్వం చేపట్టబోదని ఆయన హామీ ఇచ్చినట్లు సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం వక్ఫ్ ఆస్తుల స్వభావంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు ఉండవు.
కేంద్రప్రభుత్వం తరుపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, స్పందన దాఖలు చేయడానికి ఏడురోజుల వ్యవధికావాలని కోరారు. కాగా సుప్రీంకోర్టు ఐదురోజుల పాటు గడువును అనుమతించింది. ఐదు రోజులలోగా పిటిషనర్లు తమ వాదనలు వినిపించేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది. కేసు విచారణ ఆరంభమైన వెంటనే సొలిసిటర్ జనరల్ మెహతా తన వాదన వినిపిస్తూ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వక్ఫ్ చట్టాన్ని నిలిపివేయడం అసాధారణ చర్యగా అభివర్ణించారు. చట్టంలోని నిబంధనలను క్షుణ్ణంగా చూడాలని, కేవలం నిబంధనలను చదివి నిర్ణయాన్ని తీసుకోరాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో సవరణలు చేయడానికి ముందు లక్షలాదిమంది అభిప్రాయాలను తీసుకున్నదని, గ్రామాలకు గ్రామాలనే వక్ఫ్ లుగా తీసుకున్నారని, ప్రైవేటు ఆస్తులను ఏకపక్షంగా వక్ఫ్ లుగా తీసుకున్నారని మెహతా వివరించారు. ధర్మాసనం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చట్టబద్ధమైన నిబంధనలపై స్టే విధించడం ద్వారా తీవ్రమైన, కఠినమైన చర్య తీసుకున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టంపై పూర్తి స్థాయిలో స్టే విధించలేదని ధర్మాసనం గుర్తు చేసింది. చట్టంలో కొన్ని సానుకూల విషయాలు ఉన్నాయని తాము పేర్కొన్నామని, అందుకే పూర్తి స్థాయిలో స్టే ఉండబోదని స్పష్టం చేసినట్లు ధర్మాసనం పేర్కొంది.
అయితే మే 5 వరకూ ఇప్పుడు ఉన్న పరిస్థితి మారకూడదనే తాము కోరుకున్నామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఇస్లాం స్వీకరించినప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తయ్యేవరకూ వారికి ముస్లిం వక్ఫ్ లో చోటు ఇవ్వకుండా నిరోధిస్తూ చట్టంలో ఉన్న మరో వివాదాస్పద నిబంధనను కూడా ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది. వక్ఫ్ చట్టం పై దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విరసనలు వ్యక్తమయ్యాయి. గతవారం పశ్చిమ బెంగాల్ లో హింసాకాండకు దారితీసింది. బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన దౌర్జన్య కాండలో ముగ్గురు చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు.