Monday, January 20, 2025

కొత్త ఎంఎల్‌సిల నియామకాలను ఆపలేం

- Advertisement -
- Advertisement -

గవర్నర్ కోటా ఎంఎల్‌సిల నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి బుధవారం సుప్రీంకోర్టులో ఊరట లభిం చింది. గవర్నర్ కోటా ఎంఎల్‌సిల నియామకంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద రిలీఫ్ దక్కినట్లయంది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ స్టే అమలులో ఉంటుందని జస్టిస్ విక్రమ్‌నాధ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. గత ప్రభుత్వం నియమించిన తమను కాదని కొత్త ప్రభుత్వం ఎంఎల్‌సిలను నియామకం చేప ట్టడంపై బిఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త ఎంఎల్‌సిల నియామకాన్ని నిలుపు దల చేయాలని పిటిషన్‌లో కోరారు. కొత్త ఎంఎల్‌సిలను నియమించకుండా స్టే విధించాలని కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరి ంచింది. కొత్తగా ఎంఎల్‌సిలను నియమించకుండా స్టేటస్ కో విధించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును అభ్యర్థించారు.

గవ ర్నర్ నామి నేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్త ఎంఎల్‌సిల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరిం చినట్లు అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఎంఎల్‌సిలను ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడ మన్నది ప్రభుత్వ విధి అని పేర్కొంది. విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ నియామకాలను గవర్నర్ పక్కన పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కోదండరాం, అమీర్ అలీఖాన్ ను ఎంఎల్‌సిలుగా ఆమోదం తెలిపారు. వీరిద్దరి నియామకంలో గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారని దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఎంఎల్‌సి నియామక గెజిట్ కొట్టివేస్తూ కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకంపై స్టే విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పై బుధవారం సుప్రీంకోర్టు స్టే విధిస్తూ నిర్ణయం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News