Monday, December 23, 2024

గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం షాక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో శుక్రవారం గుజరాత్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. రా ష్ట్రంలో 68 మంది స్థానిక జడ్జిలకు పదోన్నతులపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే వెలువరించింది. రాహుల్ గాంధీని పరువు నష్టం దావా కేసులో దోషిగా నిర్థారించిన సూ రత్ కోర్టు మెజిస్ట్రేట్ హరీష్ హస్ముఖ్‌భా య్ వర్మ కూడా పదోన్నతులు పొందిన వా రిలో ఉన్నారు. ఈ పదోన్నతులను సవాలు చేస్తూ సీనియర్ జడ్జి కేడర్ స్థాయిలోని వా రు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సీనియార్టీని బేఖాతరు చేస్తూ ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రమోషన్లు ఇచ్చారని తెలిపారు. దీనితో తగు రీతిలో పూర్వాపరాలను పరిశీలించుకుని న్యాయమూర్తు లు ఎంఆర్ షా, సిటి రవికుమార్‌తో కూ డిన ధర్మాసనం ఈ ప్రమోషన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. గుజరాత్ రాష్ట్ర సర్వీసు నిబంధనలకు విరుద్ధం గా పదోన్నతులు ఉన్నాయని, ప్రమోషన్ల ప్రక్రియకు ప్రాతిపదిక కేవలం సీనియార్టీ , మెరిట్ అనే విషయం మరిచినట్లు ఉందని ధర్మాసనం తెలిపింది.

పద్ధతిని కాదంటూ ప్రమోషన్ల ఉత్తర్వులను గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం, పైగా సంబంధిత విషయాలలో సుప్రీంకోర్టు వెలువరించి ఉన్న రూ లింగ్‌కు వ్యతిరేకం అని ధర్మాసనం పే ర్కొంది. ఈ క్రమంలో ఇప్పటి పదోన్నతుల ఘట్టానికి చట్టబద్ధతలేదని పేర్కొంటూ దీనిని నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఇప్పటికైతే ఈ పదోన్నతులు చెల్లనేరనివిగా తెలియచేయడం జరుగుతోందన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రమోషన్ల జాబితాను నిలిపివేస్తున్నామని, ఈ నెల 15న ఈ ధర్మాసనంలోని న్యాయమూర్తి ఎంఆర్ షా రిటైరవుతున్నందున, తరువాత సంబంధిత ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతుందని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలు, ఆ తరువాత గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన పదోన్నతుల ఆదేశాలు, కొందరిని ఎంచుకుని జిల్లా జడ్జిలుగా నియమించడాలు అక్రమం, ఇంతకు ముందటి రూలింగ్‌కు వ్యతిరేకం అని భావిస్తూ ఈ నిర్ణయాన్ని పక్కకు పెడుతున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

గుజరాత్‌లో 68 మంది కింది స్థాయి జడ్జిలను హైకోర్టుకు ప్రమోట్ చేయడం చట్ట వ్యతిరేకం అని, సీనియార్టీని దెబ్బతీసే విధంగా ఉందని సీనియర్ సివిల్ జడ్జి కేడర్‌కు చెందిన రవికుమార్ మెహతా, సచిన్ ప్రతాప్‌రాయ్ మెహతాలు సుప్రీంను ఆశ్రయించారు. రాహుల్‌ను దోషిగా ఖరారు చేసిన సూరత్ కోర్టు జడ్జికి పదోన్నతి కల్పించడం తీవ్రవివాదాస్పద అంశం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News