Sunday, December 22, 2024

ఈశా ఫౌండేషన్ కు వ్యతిరేకంగా హైకోర్టు విచారణపై స్టే!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సద్గురు జగ్గి వాసుదేవ్ కు చెందిన ఈశా ఫౌండేషన్ కు వ్యతిరేకంగా నమోదైన అన్ని క్రిమినల్ కేసుల రిపోర్టులను అందించాలని తమిళనాడు పోలీసులను మద్రాస్ హైకోర్టు ఆదేశించిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు గురువారం స్టే ఇచ్చింది.

విచారణ త్వరగా జరపాలని ఫౌండేషన్ సుప్రీంకోర్టును కోరింది. దానికి కేంద్రం కూడా అనుకూలంగా వ్యవహరించింది. సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘‘హైకోర్టు చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అన్నారు.

ఇద్దరు యువతులను ఫౌండేషన్ బలవంతంగా నిర్బంధించిందని ఆరోపిస్తూ హైకోర్టులో దాఖలై పిటిషన్ ను కూడా భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తనకే బదిలీ చేసుకుంది. ఆ ధర్మాసనంలో న్యాయమూర్తులు జెబి. పార్ధివాలా, మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు.

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆ ఇద్దరు మహిళలను ధర్మాసనం విచారించాకే తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరు ‘‘తమ తండ్రి గత 8 ఏళ్లుగా తమని వేధిస్తున్నాడు’’ అని తెలిపింది.

‘‘ఈ అంశాలు ఆధ్యాత్మిక స్వేచ్ఛకు సంబంధించినవి. ఇది చాలా అర్జెంట్, సీరియస్ కేసు. ఇది ఈశా ఫౌండేషన్ కు సంబంధించిన కేసు. సద్గురుకు లక్షలాది అనుయాయులు ఉన్నారు. నోటితో చెప్పిన వాటిపై హైకోర్టు విచారణ జరపడం సరికాదు’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి అన్నట్లు బార్ అండ్ బెంచ్ రిపోర్టు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News