Monday, December 23, 2024

వివేకా హత్య కేసు: ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వివేకా హత్య కేసులో ఎ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. జులై 1న గంగిరెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల పై సుప్రీంకోర్టు స్టే విధించింది. వివరాల్లోకి వెళితే గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేస్తూ గత నెల 27న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30లోగా దర్యాప్తును పూర్తి చేయాలని సిబిఐకి సుప్రీంకోర్టు గడువు విధించినందున జులై 1న ఆయనను విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

దీంతో, హైకోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన సుప్రీం ధర్మాసనం జులై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News