Monday, December 23, 2024

జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై సుప్రీం స్టే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జ్ఞానవాపి మసీదులో శాస్త్రీ య సర్వే వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. వా రణాసి కోర్టు ఇచ్చిన ఈ సర్వే ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే వి ధించింది. రెండు రోజులపాటు అంటే జులై 26 సాయంత్రం 5గంటల వర కు మసీదు ప్రాంగణంలో ఎలాంటి సర్వే చేపట్టరాదని ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని వారణాసి కోర్టు గతవారం కీలక తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాల మేరకు భారత పురావస్తు విభాగ అధికారులబృందం సోమవారం సర్వే ప్రారంభించింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం అత్యవసర విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా ధర్మాసనం విచారణ జరుపుతూ సర్వే స మయంలో మసీదు ప్రాంగణంలో పురావస్తు అధికారు లు తవ్వకాలు చేపడతారా? అని కేంద్రాన్ని ప్రశ్నించిం ది. దీనికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ “ఒక్క ఇటుకనూ తొలగించట్లేదు. అ లాంటి ప్రణాళిక కూడా లేదు. ప్రస్తుతానికి అక్కడ కేవలం కొలతలు, ఫొటోగ్రఫీ, రాడార్ ప్రక్రియ మాత్రమే కొనసాగుతోంది. ఇది మసీదు నిర్మాణాలపై ఎలాంటి ప్రభావం చూపించదు” అని కోర్టుకు తెలిపారు. మసీదు ప్రాంగణంలో నిర్మాణాల తొలగింపు లేదా తవ్వకాలు చేపట్టలేదని ఎస్‌జీ పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సీజెఐ ధర్మాసనం సర్వేపై స్టే విధించింది. జులై 26వరకు మసీదు ప్రాంగణంలో ఎలాంటి శాస్త్రీయ సర్వే చేపట్టరాదని స్పష్టం చేసింది.

వారణాసి కో ర్టు ఆదేశాలపై మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతిచ్చింది. మొగల్ కాలంలో హిందూ ఆలయ స్థానంలో ఈ మసీదు నిర్మితమైందని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించి నిర్ధారించాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని కీలక తీర్పు వెలువరించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా కార్బన్ డేటింగ్, ఇతర పద్ధతుల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News