Tuesday, April 29, 2025

కృష్ణ జన్మభూమి కేసు..అలహాబాద్ హైకోర్టును సమర్థించిన సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

మథుర కృష్ణ జన్మభూమి షాహి ఈద్గా వివాదంలో కేంద్రాన్ని, భారత పురావస్తు సర్వే (ఎఎస్‌ఐ)సంస్థను ప్రతివాదులుగా చేర్చేందుకు హిందు కక్షిదారులను అనుమతించడంలో అలహాబాద్‌హైకోర్టు ప్రాథమికంగా సరైన రీతిలో వ్యవహరించిందని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఎ)ను, ఎఎస్‌ఐని ప్రతివాదులుగా చేసేందుకు రెండు దావాలకు సవరణలు చేయడానికి, పిటిషనర్లను అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. దావా సవరణను అనుమతించడంలో ప్రాథమికంగా తప్పు ఏమీ లేదని ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది.

సవరించిన పిటిషన్‌కు సమాధానాలు దాఖలు చేయవచ్చునని బెంచ్ సూచించింది. ‘ఒక విషయం సుస్పష్టం. అసలు పిటిషన్ (రెండు దావాలు)కు హిందు ఫిర్యాదీలు సవరణ చేయడాన్ని అనుమతించవలసి ఉంటుంది’ అని సిజెఐ అన్నారు. అయితే, మథుర ట్రస్ట్ షాహి మస్జీద్ ఈద్గా నిర్వహణ కమిటీ పిటిషన్ విచారణను బెంచ్ వాయిదా వేసింది. దానిని ఈ వివాదానికి సంబంధించిన ఇతర పెండింగ్ కేసులతో కలపాలని బెంచ్ సూచించింది. ‘దేవత భగవాన్ శ్రీ కృష్ణ లాలా విరాజ్‌మాన్ తదుపరి మిత్రుడు’, ‘దేవ్ ఆస్థాన్ శ్రీ కృష్ణ జన్మ భూమి’, హరి శంకర్ జైన్ సహా మరి తొమ్మిది మందిని కక్షిదారులుగా మసీదు కమిటీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News