Saturday, November 23, 2024

ప్రొఫెసర్ సాయిబాబా కేసు… హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

 Supreme Court suspended High Court verdict Prof Saibabas case

 

ముంబయి: ప్రొఫెసర్ సాయిబాబా కేసులో హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సస్పెండ్ చేసింది. బాంబే హైకోర్టు నాగ్‌పుర్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీం సస్పెండ్ చేసింది. సాయిబాబా సహా ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇటీవల బాంబే హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఎన్‌ఐఎ, మహారాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. బాంబే హైకోర్టు తీర్పును సస్పెండ్ చేస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సాయిబాబాను ఇంట్లోనే ఉండేందుకు అవకాశమివ్వాలని ఆయన తరుపు న్యాయవాది బసంత్ విజ్ఞప్తి చేశాడు. సాయిబాబా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా గృహనిర్భంధం మాత్రమే చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రొఫెసర్ సాయిబాబా న్యాయవాది విజ్ఞప్తిని ధర్మాసనం అంగీకరించలేదు. ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. సాయిబాబా తరపు న్యాయవాది బసంత్ నోటీసులను అంగీకరించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సస్పెన్షన్ కొనసాగుతుందని సుప్రీం తెలిపింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సాయిబాబాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మిగిలిన నిందితులు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News