Wednesday, January 22, 2025

కేజ్రీవాల్ బెయిల్‌పై హైకోర్టు స్టే..26న సుప్రీం విచారణ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిఇంది. తన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ వి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. దీనిపై జూన్ 26న సుప్రీం కోర్టు విచారణ చేపట్టనున్నది . ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును ఢిల్లీ హైకోర్టు అసాధారణ పద్ధతిలో నిర్వహించినట్టు గుర్తించామని కోర్టు వ్యాఖ్యానించింది. అదే రోజున తీర్పు చెప్పకుండా హైకోర్టు ఉత్తర్వులను రిజర్వు చేసిందని సుప్రీం ధర్మాసనం ప్రస్తావించింది.

అయితే తుది ఉత్తర్వులు రాకముందే దానిపై స్టే విధించి అదే ఆరోపిత తప్పును చేయబోమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణం గానే విచారణను వాయిదా వేసింది. కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ వచ్చింది. అయితే బెయిల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News