Sunday, January 19, 2025

చిక్కుల్లో కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నిషిద్ధ ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ నుంచి రాజకీయ నిధులు స్వీకరించారన్న ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్‌ఎఐ దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా సిఫార్సు చేసినట్లు రాజ్ ని వాస్ వర్గాలు సోమవారం వెల్లడించాయి. కాగా..బిజెపి ప్రోద్బలంతో కేజ్రీవాల్ పై మరో కుట్రకు లెఫ్టినెంట్ గవర్నర్ తెరతీశారని
ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. జైలులో ఉన్న దేవేంద్ర పాల్ భుల్లార్‌ను విడుదల చేసేందుకు విదేశాలలో ఉన్న సిక్కు ఉగ్రవాద ఖలిస్తానీ గ్రూపులు కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్‌కు 16 మిలియన్ డాలర్ల నిధులు అందచేసినట్లు సక్సేనాకు ఫిర్యాదు అందిందని కేంద్ర హోం కార్యదర్శికి రాసిన లేఖలో ఎల్‌జి సచివాలయం తెలిపింది. ఢిల్లీలో 1993లో 9 మంది ప్రాణాలు తీసిన ఒక బాంబు పేలుడు కేసులో దోషిగా తేనలి భుల్ల్లార్ అమృత్‌సర్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.

2001 ఆగస్టు 25న ప్రత్యేక టాడా కోర్టు భుల్ల్లార్‌కు మరణ శిక్ష విధించగా సుప్రీంకోర్టు దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. తనకు ఫిర్యాదు చేసి వ్యక్తి అందచేసిన ఎలెక్ట్రానిక్ సాక్ష్యాలను ఫోరెన్సిక్ పరీక్షలతోసహా దర్యాప్తు అవసరం ఉందని తన లేఖలో సక్సేనా పేర్కొన్నట్లు వర్గాలు తెలిపాయి. ఒక నిషిద్ధ ఉగ్రవాద సంస్థ నుంచి రాజకీయ నిధులు స్వీకరించినట్లు ఒక ముఖ్యమంత్రిపై ఫిర్యాదు అందిందని ఆయన తన లేఖలో తెలిపారు. లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే విషయాన్ని మంగళవారం సుప్రీంకోరు పరిశీలించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాగా..తాజా పరిణామంపై ఆప్ నాయకుడ, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మరో కుట్రకు తెరతీశారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ నియోజకవర్గాలను వారు(బిజెపి) కోల్పోతున్నారని, ఓటమి భయంతోనే వారు ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
మధ్యంతర బెయిల్‌పై నేడు వాదనలు
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే విషయాన్ని సుప్రీంకోర్టు మంగళవారం పరిశీలించనున్నది. ఎక్సైజ్ పాలసీకి సబంధించిన మనీ లాండరింగ్ కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు వాదనలు విననున్నది. లోక్‌సభ ఎన్నికలు రెండు దశలు పూర్తి చేసుకోగా మూడో మంగళవారం జరగనున్నది. మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్ మిగిలిన ఎన్నికల దశల కోసమైనా ప్రచారం నిర్వహించేది లేనిది సుప్రీంకోర్టు నిర్ణయంతో తేలనున్నది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం మంగళవారం మొదటి అంశంగా కేజ్రీవాల్ కేసును విచారణకు చేపట్టనున్నది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని మే 3న సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News