Wednesday, January 22, 2025

రేపు కవిత బెయిల్ వినతిపై విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో బిఆర్‌ఎస్ నాయకురాలు కె. కవిత బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. న్యాయమూర్తులు బిఆర్. గవాయ్, కెవి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. ఈ రెండు కేసుల్లో ఆమెకు బెయిల్‌ను నిరాకరిస్తూ జూలై 1న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఆగస్టు 12న సుప్రీంకోర్టు సిబిఐ, ఈడిల నుంచి స్పందన కోరింది.

ఇప్పుడు రద్దయిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పన,అమలుకు సంబంధించిన నేరపూరిత కుట్రలో ప్రధాన కుట్రదారుల్లో ఆమె ప్రాథమికంగా ఒకరని పేర్కొంటూ, రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్‌లను హైకోర్టు ఇదివరలో కొట్టివేసింది. పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి, మనీలాండరింగ్‌కు సంబంధించి సిబిఐ, ఈడి వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి.

మార్చి 15న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ లోని ఆమె నివాసం నుంచి కవిత(46)ని అరెస్ట్ చేసింది ఈడి. కాగా అవినీతి కేసులో ఏప్రిల్ 11న తీహార్ జైలు నుంచి ఆమెను సిబిఐ అరెస్ట్ చేసింది. తనపై వేసిన ఆరోపణలన్నింటినీ కవిత ఖండించారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News