- Advertisement -
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత పిటిషన్‌పై ఈ నెల 22న విచారణ సుప్రీంకోర్టు చేపట్టనుంది. తన అరెస్టు అక్రమమని, సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని ఇడి ఉల్లంఘించిందని పేర్కొంటూ కవిత సుప్రీకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం చేపట్టనుంది. ఇదిలా ఉండగా కవిత ప్రస్తు తం ఇడి కస్టడీలో ఉన్నారు.
ఈ నెల 15న ఇడి అధికారులు హైదరాబాద్‌లో ఆమెను అరెస్టు చేసి, మరుసటి రోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరిన్ని వివరాలు రాబట్టేం దుకు ఆమెను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఇడి పిటిషన్ వేయగా 7 రోజుల కస్టడీని కోర్టు మంజూరు చేసింది. 23వ తేదీ సాయంత్రానికి కవిత కస్టడీ పూర్తవుతుంది.
- Advertisement -