Sunday, October 6, 2024

నీట్ లీక్ నిజమే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నీట్ యుజి 2024 వైద్య ప్రవేశ పరీక్ష పవిత్రత ‘కోల్పోతే’, ప్రశ్న పత్రం లీక్ గురించి సా మాజిక మాధ్యమం ద్వారా ప్రచారం జరిగినట్లయితే తిరిగి పరీక్ష నిర్వహణకు ఆదేశించవలసి వస్తుందని సుప్రీం కోర్టు సోమవారం సుస్పష్టం చేసింది. ప్రశ్న పత్రం లీక్ కనుక టెలిగ్రామ్, వా ట్సాప్, ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో జరిగినట్లయితే, అ ది ‘దావానలంలా వ్యాపిస్తుంది’ అని ప్రధాన న్యా యమూర్తి డివై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ప్రశ్న పత్రం లీక్ అ యిందన్నది మాత్రంసుస్పష్టం’ అని న్యాయమూర్తులు జెబి పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూ డిన బెంచ్ తెలియజేసింది. ప్రశ్నపత్రం లీకైన సమయం, లీక్‌కు, అసలు పరీక్షకు మధ్య వ్యవధి గురించి ఎన్‌టిఎ, సిబిఐ నుంచి సమాచారాన్ని కోర్టు కోరింది. ఇంత వరకు గుర్తించిన దోషుల సంఖ్య, ప్రశ్న పత్రం లీక్‌కు అనుసరించిన పద్ధతి గురించిన వివరాలు కూడా కావాలని బెంచ్ కోరింది.

నీట్ యుజిలో అవకతవకల ఆరోపణల పై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసిన కోర్టు దర్యాప్తు ఏ స్థా యిలో ఉందో సూచించే నివేదికను తమకు స మర్పించాలని సిబిఐ దర్యాప్తు అధికారిని ఆదేశించింది. అక్రమాలు, ఒఎంఆర్ షీట్‌లో మార్పులు చేర్పులు, బోగస్ వ్యక్తుల హాజరు, వంచన వంటి ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు జరుపుతోంది. ‘పరీక్ష విశ్వసనీయత దెబ్బ తిన్న పక్షంలో తిరిగి పరీక్షకు ఆదేశించవల సి వస్తుంది. దోషులను మేము గుర్తించలేకపోయినట్లయితే తిరిగి పరీక్షకు ఆదేశించవలసి వస్తుం ది. లీకైన ప్రశ్న పత్రం సామాజిక మాధ్యమం ద్వారా వ్యాపించిన పక్షంలో తిరిగి పరీక్ష నిర్వహణకు ఆదేశింవచలసి వస్తుంది’ అని బెంచ్ పేర్కొన్నది. ‘జరిగినదానిని మనం తోసిపుచ్చజాలం’ అ ని బెంచ్ అన్నది. ‘ప్రభుత్వం పరీక్షను రద్దు చేయదని భావిస్తే ప్రశ్న పత్రం లీక్ వల్ల లబ్ధి పొందినవారిని గుర్తించేందుకు అది ఏమి చేయబోతున్న ది’ అని బెంచ్ ప్రశ్నించింది.

నీట్ యుజి 2024 వివాదానికి సంబంధించిన 30 పైచిలుకు పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం విచారిస్తున్నది. మే 5న పరీక్షలో అవకతవకలు, అక్రమాలు చోటు చే సుకున్నాయన్న ఆరోపణలతో పాటు, తిరిగి పరీక్ష నిర్వహించాలని ఆదేశించాలని కోరుతున్న పిటిషన్‌లు కూడా వాటిలో ఉన్నాయి. ‘ప్రశ్న పత్రం లీక్ అయిందనడంలో సందేహం ఏమాత్రం లేదు. లీక్ ఎంత మేర జరిగిందన్నది మేము నిర్ధారిస్తున్నాం’ అని బెంచ్ తెలిపింది. అయితే, ‘లీక్‌కు, అసలు పరీక్షకు మధ్య వ్యవధి పరిమితంగా ఉన్నట్లయితే’ తిరిగి పరీక్ష నిర్వహణకు వ్యతిరేకంగా వాదనలు వస్తాయని, ‘పరీక్ష రోజు ఉదయం (లీకైన ప్రశ్నలను) కంఠస్థం చేయాలని విద్యార్థులను కోరినట్లయితే, లీక్ అంత విస్తృతంగా ప్రచారం అయి ఉండేది కాదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. పరీక్షకు హాజరైనవారిలో అనేక మంది పేద కుటుంబాల నుంచి వచ్చి ఉంటారని, వారు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు డబ్బు ఖర్చు చేయలేకపోవచ్చునని, అందువల్ల తిరిగి పరీక్షకు ఆదేశించడానికి ఇష్టపడడం లేదని బెంచ్ తెలిపింది. తిరిగి పరీక్ష నిర్వహించడం ‘చివరి మార్గం’ అవుతుందని బెంచ్ సూచించింది.

67 మంది అభ్యర్థులు 720/720 సాధించినందున కొన్ని ‘ఎర్ర జెండాలు’ ఉన్నాయని బెంచ్ వ్యాఖ్యానించింది. ‘గత సంవత్సరాల్లో ఆ దామాషా చాలా తక్కువగా ఉంది’ అని బెంచ్ తెలిపింది. ప్రశ్న పత్రం లీక్ వల్ల ఎంత మంది లబ్ధి పొందారో, వారిపై కేంద్రం ఏ చర్యలు తీసుకున్నదో తాము తెలుసుకోవాలని అనుకుంటున్నామని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. ‘ఎందరు దోషుల ఫలితాలు నిలిపివేశారు? అటువంటి లబ్ధిదారులు ఏ ప్రాంతం వారో తెలుసుకోవాలని అనుకుంటున్నాం’ అని కోర్టు చెప్పింది. వివాదాస్పద పరీక్షను రద్దు చేయకుండా కేంద్రాన్ని, ఎన్‌టిఎను నిరోధించాలని కోరుతూ గుజరాత్‌కు చెందిన పాసైన నీటి యుజి అభ్యర్థులు 50 మందికి పైగా విడిగా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా బెంచ్ విచారిస్తున్నది. ఒక పిటిషనర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులు తమ వాదనలు ప్రారంభించారు. ప్రశ్న పత్రం లీక్, ఒఎంఆర్ షీట్‌లో మార్పులు చేర్పులు, బోగస్ వ్యక్తుల హాజరు,

వంచన వంటి కారణాలపై పరీక్ష రద్దును తాము కోరుతున్నట్లు వారు తెలిపారు. పరీక్షను రద్దు చేయడం ‘బెడిసి కొడుతుంది’ అని, పరీక్ష విశ్వసనీయతకు పెద్ద ఎత్తున భంగం కలిగిందనేందుకు దాఖలా ఏదీ లేని కారణంగా లక్షలాది మంది నిజాయతీ అభ్యర్థుల అవకాశాలను ‘తీవ్రంగా దెబ్బ తీస్తుంది’ అని కేంద్రం, నీట్ యుజి నిర్వహించే ఎన్‌టిఎ తమ అఫిడవిట్ల ద్వారా ఇటీవల సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News