Sunday, December 22, 2024

కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై రేపే విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొత్తగా చేసిన మూడు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను మే 20న విచారించనున్నది. ఆ మూడు కొత్త చట్టాలను  పాత చట్టాలలోని ‘లోపాలు, వ్యత్యాసాలు’  కారణంగా చేశారు. న్యాయమూర్తులు బేలా ఎం. త్రివేది, పంకజ్ మిఠల్ తో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ చేయనున్నది.

లోక్ సభ డిసెంబర్ 21న మూడు కీలక చట్టాలు- భారతీయ న్యాయ(రెండోది) సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష(రెండోది), భారతీయ సాక్ష్య(రెండోది) బిల్లు ఆమోదించారు. కాగా ఈ మూడు బిల్లులకు డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపింది.

ఈ మూడు కొత్త చట్టాలు.. ఇండియన్ పెనల్ కోడ్(ఐపిసి), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సిఆర్ పిసి), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో రానున్నాయి. అయితే కొత్త చట్టాలపై స్టే కోరుతూ అడ్వొకేట్ విశాల్ తివారి పిల్ దాఖలు చేశారు. పార్లమెంటులో ఎలాంటి చర్చ జరుపకుండానే ఆ కొత్త చట్టాలను తీసుకొచ్చారని, చాలా మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్లో ఉండగా వాటిని తెచ్చారని పేర్కొన్నారు. కొత్త చట్టాలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని కూడా ఆయన కోర్టును కోరారు.  కొత్త మూడు చట్టాలు రాక్షస చట్టాలని, భారత ప్రజల ప్రాథమిక హక్కులను హరించేవని తన పిటిషన్ లో పేర్కొన్నారు. బ్రిటిష్ వలస చట్టాలే ఓ వ్యక్తిని గరిష్ఠంగా 15 రోజల వరకు పోలీస్ కస్టడీకి అప్పగించేదని, కానీ ఈ కొత్త చట్టాలు 90 రోజుల వరకు పోలీస్ కస్టడీకి పొడగించేలా ఉన్నాయని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News