Sunday, January 19, 2025

శ్రీ క్రిష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదంపై నవంబర్ 10న సుప్రీం విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : శ్రీక్రిష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదంపై నవంబర్ 10న విచారణ చేపడతామని సుప్రీం కోర్టు సోమవారం వెల్లడించింది. ఈ వివాదానికి సంబంధించి ముడిపడి ఉన్న అన్ని అభ్యంతరాలపై విచారణను మధుర కోర్టుకు బదిలీ చేస్తూ అలహాబాద్ హైకోర్టు మే 26న ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై షాహీ మసీద్ కమిటీ సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీం కోర్టు అక్టోబర్ 3న ఈ వ్యాజ్యానికి సంబంధించి బదిలీ చేసిన అన్నివ్యాజ్యాల సమాచారాన్ని దాఖలు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. హైకోర్టు ఏం చెప్పిందో తాము పరిశీలిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు సోమవారం కొద్ది సేపు దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News