Monday, January 20, 2025

న్యూస్‌క్లిక్ పురకాయస్థ పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టు విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉపా చట్టం కింద అరెస్ట్ చేయడం, పోలీస్ రిమాండ్‌లో ఉంచడాన్ని సవాలు చేస్తూ న్యూస్‌క్లిక్ సంస్థాపకులు ప్రబీర్ పురకాయస్థ, ఆయన హెచ్‌ఆర్ అధినేత అమిత్ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్లపై ఈనెల గురువారం విచారించనున్నట్టు సుప్రీం కోర్టు బుధవారం వెల్లడించింది. ఈ నెల 13న ప్రబీర్ పురకాయస్థ, అమిత్ చక్రవర్తి తమను అరెస్ట్ చేయడం, ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ కోర్టున ఆశ్రయించగా, ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. దీంతో వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించవలసి ఉందని, గురువారం ఈ విచారణ చేపడతామని.

పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్లు కపిల్ సిబల్, దేవదత్ కామత్ లకు వెల్లడించారు. ఉపా చట్టం కింద సిటీ పోలీస్‌లు వీరిపై కేసులు దాఖలు చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని అస్థిరపర్చడానికి చైనా నుంచి వీరి న్యూస్ పోర్టల్‌కు భారీ ఎత్తున నిధులు వస్తున్నాయని పోలీస్‌లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రక్రియను విచ్ఛిన్నం చేయడానికి పీపుల్స్ అలియెన్స్ ఫర్ డెమొక్రసీ, సెక్యులరిజం (పిఎడిఎస్)తో పురకాయస్ఠ రహస్య కార్యకలాపాలు సాగిస్తున్నారని ఛార్జిషీట్‌లో ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News