Sunday, January 19, 2025

బిల్లులకు ఆమోదంలో గవర్నర్ల జాప్యంపై నేడు సుప్రీంకోర్టు విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు ఆమోదముద్ర వేయడంలో గవర్నర్లు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు దాఖలు చేసుకున్న రెండు వేర్వేరు పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పర్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి తిప్పి పంపడంతో శనివారం జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఈ బిల్లులను ఏకగ్రీవంగా మరోసారి ఆమోదించిన విషయం తెలిసిందే.

ఈ బిల్లులను ఆమోదముద్ర కోసం రాష్ట్ర గవర్నర్‌కు తిరిగి పంపించారు కూడా. తమిళనాడు గవర్నర్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదముద్ర వేయడంలో జాప్యం చేయడానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా ఈ నెల 10న అభివర్ణించిన సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వ పిటిషన్‌పై కేంద్రప్రభుత్వ స్పందనను కోరింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం, ఈ సమస్యను పరిష్కరించడానికి అటార్నీ జనరల్ లేదా, సొలిసిటర్ జనరల్ సహాయాన్ని కోరింది కూడా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News