Thursday, January 23, 2025

సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డికి చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వైసిపి కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ వాదనలు వినేంత వరకు తనను అరెస్ట్ చేయకుండా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలనే విన్నపాన్ని సుప్రీం తిరస్కరించింది. ఈ నెల 25న అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది. తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అవినాష్‌కు సూచించింది. అరెస్ట్ చేయకుండా సిబిఐని ఆదేశించలేమని స్పష్టం చేసింది. మరో వైపు విచారణ సందర్భంగా సిబిఐ నోటీసులకు ఎందుకు స్పందించడం లేదని, విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని అవినాష్ తరపు లాయ ర్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Also Read: ట్రాక్టర్, కారు ఢీ.. తల్లీ, కూతురు దుర్మరణం

అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం తిరస్కరించడంతో ప్రస్తుతం సిబిఐ అధికారులు ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇంకోవైపు, సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సిబిఐ తరపున న్యాయవాది హాజరుకాకపోవడం గమనార్హం. కాగా, కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై ఈ ఏడాది ఏప్రిల్ చివరిలో విచారణ జరిగింది. అయితే అదే రోజున తెలంగాణ హైకోర్టు చివరి పని దినం. అయితే, ఈ విషయమై తీర్పును ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ ఏడాది జూన్ 5వ తేదీకి తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. మరో వైపు వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16, 18, 22న సిబిఐ అధికారులు విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయితే పలు కారణాలను చూపుతూ అవినాష్ రెడ్డి విచారణ కు హాజరుకాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News