Thursday, January 23, 2025

సుప్రీం కోర్టులో కనిమొళి కరుణానిధికి భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : డిఎంకె నేత కనిమొళి కరుణానిధికి సుప్రీం కోర్టులో గురువారం భారీ ఊరట లభించింది. తమిళనాడు లోని తూతుక్కుడి నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో డిఎంకె ఎంపిగా విజయం సాధించడాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. కనిమొళి ఎన్నికను సవాల్ చేస్తూ సనాతన కుమార్ అనే ఓటర్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను జస్టిస్‌లు అజయ్ రస్తోగీ, బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. నామినేషన్ సమయంలో కనిమొళి తన అఫిడవిట్‌లో కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు సరిగ్గా పొందుపర్చలేదని, ముఖ్యంగా భర్త పాన్ నెంబర్‌ను చేర్చలేదని పిటిషన్‌దారుడు సనాతన కుమార్ అభ్యంతరం లేవదీశారు.

Also Read: ఆరని ఈశాన్య మంట

దీనిపై కనిమొళి తన భర్త సింగపూర్ లో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐ అని, ఆయనకు పాన్ నెంబర్ ఉండదని, అలాగే భారత్‌లో ఆయన ఆదాయ పన్ను చెల్లించడం ఉండదని వివరించారు. తనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలని ఆమె మద్రాస్ హైకోర్టును అభ్యర్థించగా హైకోర్టు నిరాకరించింది.ఈ సమయంలో కనిమొళి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు 2020 జనవరిలో స్టే విధించింది. గురువారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఇదే విధంగా ఆమె ఎన్నికను సవాలు చేస్తూ ఆనాటి సమీప బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ (ఇప్పటి తెలంగాణ గవర్నర్) పిటిషన్ దాఖలు చేశారు. అయితే గవర్నర్ అయిన తరువాత ఆమె ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆమెకు బదులుగా స్థానిక బీజేపీ నేత ఎ. ముత్తురామలింగం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News