Thursday, January 23, 2025

జల్లికట్టుకు అనుమతిస్తూ తమిళనాడు చట్టాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎద్దులను లొంగదీసుకునే క్రీడ ‘జల్లికట్టు’కు సంబంధించిన తమిళనాడు చట్టం చెల్లుబాటును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. న్యాయమూర్తి కె.ఎం. జోసఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మహారాష్ట్ర, క ర్నాటక చట్టాలలో కూడా ఎటువంటి చట్టవిరుద్ధత లేదని నిర్ధారించింది, అక్కడి ఎద్దుల బండ్ల పందెం, కంబళాను అనుమతించింది.

తమిళనాడులో ‘జల్లికట్టు’ కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్నదని, జంతువుల పట్ల ఎలాంటి క్రూరత్వం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టినట్లు కూడా తెలిపింది. ‘తమిళనాడు చట్టం చెల్లుబాటవుతుంది, అందులో ఎలాంటి తప్పు లేదు’ అని న్యాయమూర్తి అనిరుద్ధ బోస్ ధర్మాసనం తరఫున ప్రకటించారు. మూడు రాష్ట్రాలు ఆమోదించిన సవరణ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం కూడా లభించిందని, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించరాదని కోర్టు పేర్కొంది. న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, హృషికేశ్ రాయ్, సిటి. రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం కూడా రాష్ట్ర చట్టాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించవని ప్రకటించింది.

రాష్ట్ర చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ జంతు హక్కుల సంస్థ ‘పెటా’ దాఖలు చేసిన పిటిషన్‌తో సహా అన్ని పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. ‘మేము చట్ట విధానాలకు అంతరాయం కలిగించము’ అని ధర్మాసనం పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News