Saturday, November 16, 2024

మధుర శ్రీకృష్ణ జన్మభూమి కేసు: సుప్రీం సంచలన నిర్ణయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మధుర శ్రీకృష్ణ జన్మభూమి కేసు విచారణలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మసీదు కమిటీ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. ఈ అంశాన్ని హైకోర్టులో మాత్రమే ఉంచాలని పేర్కొంది. 18 కేసుల్లో 15ని కలిపి విచారించాలని అభ్యర్థించినందున ఇందులో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోలేదని న్యాయస్థానం తెలిపింది. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని మసీదు కమిటీకి స్పష్టం చేసింది. వివాదానికి సంబంధించిన 15 కేసులను కలిపి విచారించాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని మసీదు కమిటీ వ్యతిరేకించింది. వీటిని మధుర జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు బదిలీ చేయడాన్ని మసీదు కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ పిటిషన్ ఏప్రిల్‌లో విచారణకు రానుంది. అలహాబాద్ హైకోర్టులో వాదనలు వినిపించాల్సిందిగా షాహీ ఈద్గా మసీదును సుప్రీం కోర్టు కోరిందని హిందూ తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ అన్నారు. శ్రీకృష్ణుడి జన్మభూమిగా భావిస్తున్న ప్రాంతంలో షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించిన 15 కేసులను కలిపి హైకోర్టు విచారణ చేపట్టిందని చెప్పారు. రీకాల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత సుప్రీం కోర్టుకు రావాలని మసీదు కమిటీకి శంకర్ జైన్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News