Monday, January 20, 2025

వేరే రాష్ట్రంలోనూ ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు సమ్మతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వ్యక్తులకు ముందస్తు బెయిల్‌కు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఎవరిపై అయినా వేరే రాష్ట్రంలో ఎఫ్‌ఐఆర్ దాఖలు అయి ఉన్నప్పటికీ అరెస్టు నివారణకు సంబంధించిన ముందస్తు బెయిల్‌ను హైకోర్టులు, సెషన్స్ కోర్టులు వెలువరించవచ్చునని , అయితే ఈ అవకాశం కేవలం అరుదైన, అసాధారణమైన పరిస్థితులలోనే ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయ ప్రయోజనాల కోణంలో ఈ వెసులుబాటుకు వీలుంటుందని తెలిపారు. రాజ్యాంగంలో పౌరుల జీవన హక్కు , వారి వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణ అంశం కీలకంగా ఉందని, దీనిని పరిగణనలోకి తీసుకుని ఈ రూలింగ్ వెలువరిస్తున్నట్లు , ఇందులో దిగువ కోర్టులకు రాష్ట్రాల పరిమితి ఉండదని స్పష్టం చేశారు. సంబంధిత కేసులో న్యాయమూర్తులు బివి నాగరత్నం, ఉజ్వల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం రూలింగ్ కీలకం అయింది.

వ్యక్తులపై కేసులు తలెత్తినప్పుడు సదరు వ్యక్తి వేరే చోట కూడా ముందస్తు బెయిల్‌కు అప్పీలు చేసుకోవచ్చు. అయితే తనపై కేసు దాఖలు అయిన రాష్ట్రానికి ఎందుకు వెళ్లలేకపోతున్నది? అక్కడ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేకపోతున్నది సరైన విధంగా తెలియచేసుకోవల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇటువంటి అసాధారణ బెయిల్ మంజూరీ ప్రక్రియను నిందితులు దుర్వినియోగం చేసుకోరాదని, ప్రాణహాని ముప్పు ఉన్న దశలోనే ఇటువంటి బెయిల్‌ను పొందేందుకు వీలుంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. వ్యక్తుల స్వేచ్ఛను కాపాడటం న్యాయస్థానం ధర్మం, అయితే ఇదే సమయంలో ఈ స్వేచ్ఛను పౌరులు వేరే విధంగా వాడుకుంటామంటే కుదరదని ధర్మాసనం తెలిపింది. ఓ వరకట్నం కేసులో ఓ వ్యక్తిపై రాజస్థాన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీనిపై బెంగళూరు కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. రాజస్థాన్‌లో అరెస్టు కాకుండా ఈ బెయిల్ పనికి వచ్చింది దీనిని సవాలు చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టులో దాఖలు అయిన పిటిషన్ విచారణ దశలో ఇప్పుడు ఈ వెసులుబాట్ల ముందస్తు బెయిల్ సబబే అనే తీర్పు వెలువడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News