Monday, December 23, 2024

370 అధికరణం రద్దుపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: కేంద్రం రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు ప్రకటించనున్న దృష్టా కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణం ఉండేలా చూడడానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కశ్మీర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు( ఐజిపి) వికె బిద్రి చెప్పారు.‘అన్ని పరిస్థితుల్లో కశ్మీర్‌లో శాంతి ఉండేలా చూడడం మా విధి’ అని ఆయన చెప్పారు. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేసి, ఒకప్పటి జమ్మూ, కశ్మీర్ రాష్ట్రాన్ని మూడు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు ప్రకటించనుంది.

గత ఆగస్టు 2నుంచి ఈ వ్యవహారంపై రోజువారీ విచారణ జరిపిన తర్వాత సెప్టెంబర్ 5న విచారణ పూర్తి చేసిన అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఈ తీర్పు దృష్టా చేసిన భద్రతా ఏర్పాట్ల వివరాలను వెల్లడించడానికి నిరాకరించిన బిద్రి తగ్ను భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మాత్రమే చెప్పారు.గత రెండు వారాలుగా కశ్మీర్ లోయలోని తొమ్మిది జిల్లాల్లో భద్రతా చర్యలకు సంబంధించి బిద్రి పలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. సుప్రీంకోర్టు ప్రకటించనున్న తీర్పుకు సంబంధించి సోషల్ మీడియా దుర్వినియోగంపై 144 సెక్షన్ కిందనిషేధపు ఉత్తర్వులు జారీ చేశారా అని అడగ్గా, ప్రజలను రెచ్చగొడుతూ ఇటీవలి కాలంలో అనేక పోస్టులు వచ్చాయని ఆయన చెప్పారు.

అలాంటి శక్తులపై గతంలోనూ చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులో కూడా తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అభ్యంతరకరమైన అంశాలుండే మెస్సేజ్ ఏదయినా వస్తే వెంటనే దగ్గర్లోని పోలీసు స్టేషన్‌కు లేదా పోలీసు పోస్టుకుఆ మెస్సేజ్‌కి చెందిన స్క్రీన్ షాట్, పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలని ఈసందర్భంగా పోలీసులు ప్రజలకు గైడ్‌లైన్స్‌ను కూడా జారీ చేశారు. కాగా సుప్రీంకోర్టు ప్రకటించనున్న తీర్పుపై కశ్మీర్‌లోని రాజకీయ పార్టీ ఆచితూచి స్పందిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు జమ్మూ,కశ్మీర్ ప్రజలకు అనుకూలంగా ఉండాలని తాను ఆశిస్తున్నానని, ప్రార్థిస్తున్నానని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. భారతీయ జనతా పార్టీ అజెండాను ప్రోత్సహించకుండా, దేశ సమగ్రత, రాజ్యాంగం చెక్కు చెదరకుండా ఉండేలా చూడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుపై ఉందని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News