Sunday, December 22, 2024

ఆ 8 ఓట్లూ చెల్లుతాయి: చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీం తీర్పు

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు రీకౌంటింగ్ కు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి చెల్లనివిగా పరిగణించిన ఎనిమిది ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంగళవారం పేర్కొంది.

చండీగఢ్ మేయర్ ఎన్నికకు జనవరి 30న పోలింగ్ జరిగింది. బిజేపి అభ్యర్థికి 16 ఓట్లు రాగా, ఆప్, కాంగ్రెస్ ల తరపున బరిలోకి దిగిన ఉమ్మడి అభ్యర్థికి 20 ఓట్లు వచ్చాయి. అయితే ఉమ్మడి అభ్యర్థికి పోలైన ఓట్లలో ఎనిమిది ఓట్లు చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి పేర్కొనడంతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. దీనిపై ఆప్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. మేయర్ ఎన్నికలో అక్రమాలు జరిగాయనీ, రీపోలింగ్ జరపాలని కోరింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం విచారణ జరిపింది.

బ్యాలెట్ పత్రాలపై ఎక్స్ మార్క్ ఎందుకు వేశారని రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ను బెంచ్ నిలదీసింది. అప్పటికే చెల్లుబాటు కాని బ్యాలెట్ పత్రాలపై ఎక్స్ గుర్తు వేశానని, ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై అలా వేశాననీ ఆయన అంగీకరించారు. దాంతో ఆ ఎనిమిది ఓట్లను చెల్లుబాటులోకి తీసుకుని, రీకౌంటింగ్ చేసి ఫలితం ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News