Monday, January 20, 2025

స్కిల్ కేసులో చంద్రబాబుపై 16న సుప్రీం తీర్పు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : స్కిల్ అభివృద్ధి సంస్థ (ఎస్‌డిసి) కుంభకోణం కేసులో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ నెల 16న తీర్పు వెలువరించనున్నది. ఈ కేసులో తనపై ఎఫ్‌ఐఆర్ రద్దుకు ఎపి హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా 2015లో స్కిల్ సంస్థ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణపై ఆయనను నిరుడు సెప్టెంబర్ 9న అరెస్టు చేశారు.

ఆయన ఆ విధంగా రూ. 371 కోట్లను దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. అయితే, చంద్రబాబు ఆ ఆరోపణలను ఖండించారు. ఈ కేసులో ఆయనకు ఎపి హైకోర్టు నిరుడు నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో తనపై ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయడానికి హైకోర్టు నిరుడు సెప్టెంబర్ 22న నిరాకరించడంతో ఆ ఉత్తర్వును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీం న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం నిరుడు అక్టోబర్ 17న తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News