Wednesday, December 25, 2024

రాహుల్ గాంధీ సారీ చెపుతారా..?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు సక్రమం, లోపాలు లేని నిర్ణయం అని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై భారతీయ జనతాపార్టీ సోమవారం హర్షం వ్యక్తం చేసింది. ఇది చారిత్రక తీర్పు అని పేర్కొంది. నోట్ల రద్దు నిర్ణయం తప్పులతడక, జనంపై పిడుగుపాటు అని పలుసార్లు విమర్శలకు దిగిన రాహుల్ గాంధీ ఇప్పుడు బహిరంగ క్షమాపణలు చెపుతారా? అని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి , బిజెపి నేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఉగ్రవాద నిధుల చేరవేతకు అడ్డుకట్ట అయిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళించిందని, ఆదాయపు పన్నుకు ఊతం దక్కిందని , అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇతరులు పదేపదే పెద్ద నోట్ల రద్దుపై అవాకులు చవాకులకు దిగారని , చివరికి విదేశాల్లో కూడా ఈ జాతీయ ఆర్థిక విషయాన్ని ఆయన ప్రస్తావించారని మరి ఇప్పుడు తన తప్పిదం నిరూపితం అయినందున క్షమాపణలు కోరుతారా? అని నిలదీశారు.

పైగా ఇప్పటి తీర్పులోని వ్యతిరేక అభిప్రాయాన్ని కేవలం మైనార్టీ తీర్పును కాంగ్రెస్ పదేపదే ప్రస్తావించడం తమ వాదన సరైనదని తెలియచేసుకోవడం విడ్డూరంగా ఉందని బిజెపి నేత విమర్శించారు. పెద్దనోట్ల రద్దుకు సంబంధించి మెజార్టీ తీర్పులోని సముచితతను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఇప్పుడుమైనార్టీ తీర్పు పాట పాడుతున్నారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు జాతీయ ప్రయోజనాల కోణంలో తీసుకున్న చారిత్రక నిర్ణయం , దీనిని సుప్రీంకోర్టు సమర్థించడం మరింత చారిత్రకం అని వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు తరువాత కీలక ఆర్థిక పరిణామాలు జరిగాయి. భారతదేశం ఇప్పుడు డిజిటల్ చెల్లింపులలో ప్రపంచ నెంబర్ 1 అయింది. ఈ ఏడాది అక్టోబర్ లోనే దేశంలో రూ 12 లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు సాగాయి.

పెద్దనోట్ల రద్దు తరువాత నుంచి ఇప్పటివరకూ దేవంలో 730 కోట్ల ఆన్‌లైన్ ప్రక్రియలు జరిగాయని వివరించారు. విభిన్న తీర్పులో కూడా పాలసీ నిర్ధేశిత సముచిత లక్షం సంతరించుకుని ఉందని పేర్కొన్నారని, అయితే దీనికి కూడా ప్రతిపక్ష నేతలు వక్రీకరణలకు దిగడం శుద్ధ దండగ చర్య అని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News