- Advertisement -
బెంగళూరు: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని రద్దు చేసేందుకు నిరాకరిస్తూ కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరించిన కర్నాటక హైకోర్టు తీర్పుపై దాఖలైన పిటిషన్లపై 10 రోజుల పాటు వాదనలు విన్న న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 22న తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తరగతి గదుల్లో హిజాబ్‌పై నిషేధం సహేతుకమైన పరిమితి అని, ఇస్లాంలో హిజాబ్ ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విద్యార్థులు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఏం చెబుతుందోనని అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
- Advertisement -