Monday, December 23, 2024

స్వలింగ వివాహ చట్టబద్ధతపై సుప్రీం తీర్పు…

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: స్వలింగ సంపర్కుల వివాహ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుకు ఎల్‌జిబిటిక్యు (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) ఉద్యమ నేతల నుంచి మిశ్రమ స్పందన వెలువడింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు సంబంధించి సమాన హక్కులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించిన విషయం తెలిసిందే. ఈమేరకు సుప్రీం తీర్పు లోని కొన్ని అంశాలపై ఒక వర్గం ప్రశంసించగా, మిగతా వారు ఈ వివాహానికి చట్టబద్ధత కల్పించలేదని అసంతృప్తి వెలిబుచ్చారు. స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోడానికి హక్కు కల్పించడం, అలాగే వారు దత్తత చేసుకోడానికి హక్కులు కల్పించడమంటే మొత్తం ఎల్‌జిబిటిక్యుకు రక్షణ కల్పించడమే అవుతుందని ఇది చారిత్రాత్మకమైన తీర్పు అని “ప్రాంతకథ” అనే ఎన్‌జిఒ ఫౌండర్, డైరెక్టర్ బప్పాదిత్య ముఖర్జీ పేర్కొన్నారు.

స్వలింగ సంపర్కులకు రాజ్యాంగ పరమైన రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు సుప్రీం ధర్మాసనం సూచించిందని చెప్పారు. స్వలింగ సంపర్కుల హక్కులపై ప్రజల్లో చైతన్యం కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుప్రీం చెప్పడాన్ని ముఖర్జీ ప్రశంసించారు. అలాగే ఉభయ లింగ (ఇంటర్‌సెక్స్) శరీరం కలిగిన పిల్లలు వారు అర్థం చేసుకునే వయసు వచ్చేవరకు లింగ మార్పిడి శస్త్రచికిత్సలు చేయరాదని సుప్రీం చెప్పిందని ప్రశంసించారు. సుప్రీం తీర్పు అంశాలు అంత సంతోషకరమైనవి కావని లింగ అధ్యయన అధ్యాపకురాలు , సంస్కృత కళాశాల, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సమంత బిశ్వాస్ వ్యాఖ్యానించారు. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించడానికి సుప్రీం కోర్టు వ్యతిరేకించడం దేశం లోని స్వలింగ సంపర్కుల ఉద్యమానికి వెనుకబాటు అవుతుందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News