Sunday, November 17, 2024

కొలీజియం చిచ్చు

- Advertisement -
- Advertisement -

కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల నియామకంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల న్యాయ వ్యవస్థ పనితీరు దెబ్బతింటున్నదని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ లోగా న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన 20 ఫైళ్లను కేంద్రం కొలీజియంకు తిప్పి పంపింది. జడ్జీల ఎంపికను తిరిగి పరిశీలించాల్సి ఉందని తెలిపింది. దీంతో కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మధ్య కొలీజియం చిచ్చు రగిలినట్లయింది.

సిఫార్సుల అమలులో జాప్యంపై అసహనం

న్యూఢిల్లీ: కొలీజియం సిఫార్సు చేసిన వారిని జడ్జిలుగా నియమించడంలో కేంద్రం జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం ఉదాసీనత న్యాయమూర్తుల నియామక విధానంపై ప్రభావం చూపుతోందని సోమవారం సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఎస్‌కే కౌల్, ఎఎస్ ఓకాతో కూడా ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం మాట్లాడుతూ.. నిర్ణీత గడువులో న్యాయమూర్తుల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రానికి తెలిపింది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్స్ చట్టం మస్టర్‌ను ఆమోదించకపోవడం పట్ల కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉందని అయితే చట్టప్రాధాన్యదేశంలో అది కారణం కారాదని కౌల్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తన 2015 తీర్పులో ఎన్‌జెఎసి చ ట్టం, రాజ్యాంగ (99సవరణ) చట్టం 2014 ను కొట్టివేసింది. ఇది రాజ్యాంగ న్యాయస్థానాలకు న్యాయమూర్తులను నియమించే ప్ర స్తుత న్యాయమూర్తుల కొలీజియం వ్యవస్థ పునరుద్ధరణకు దారి విచారణ సందర్భంగా ధర్మాసనం అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణితో మాట్లాడుతూ వాస్తవం ఏమిటంటే కొలీజియం చేసిన పేర్లను పునరుద్ఘాటించినా నియామక ప్రక్రియ చేపట్టడం లేదని స్పష్టం చేసింది.

కేంద్రం ఉదాసీనంగా ఉంటే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది. మేము ఇప్పటికే మా అసహనం వ్యక్తం చేశామని బెంచ్ పేర్కొంది. ఎన్‌జెఎసి పాస్ అవకపోవడంతో కేంద్రం అసహనంగా ఉందనిపిస్తుంది అని కౌల్ అన్నారు. కొన్నిసార్లు చట్టం మస్టర్‌ను అనుమతిస్తుంది అదేవిధంగా కొన్నిసార్లు అనుమతించదన్నారు. కేంద్రం ఉదాసీన వైఖరికి ఇది కారణం కాకూడదు. సకాలంలో నియామకాన్ని సులభతరం చేసేందుకు గత ఏడాది ఏప్రిల్ 20న సుప్రీంకోర్టు నిర్దేశించిన కాలపరిమితిని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ఆరోపణపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకప్రక్రియను రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తావించింది. ఒకసారి ఒక పేరును పునరుద్ఘాటించిన తరువాత దాని ముగుస్తుంది. కొలీజియం సిఫార్సులపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వ్యవస్థను నిరాశపరుస్తుంది. కొలీజియం ఏడాదిన్నర క్రితం సిఫార్సు చేసిన పేర్లు కేంద్రం ప్రభుత్వం వద్ద ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. నియామక ప్రక్రియలో జాప్యం కారణంగా కొంతమంది సీనియర్ న్యాయవాదులు బెంచ్‌కు ఎలివేషన్ కోసం ఇచ్చిన సమ్మతిని సుప్రీం ధర్మాసనం తెలిపింది. కొలీజియం సిఫార్సు చేసినవారిలో ప్రభుత్వం కొన్నిసార్లు ఒక పేరును మాత్రమే ఎంపిక చేస్తుంది. దీనివల్ల సీనియార్టీకి పూర్తిగా భంగం కలుగుతుందని బెంచ్ పేర్కొంది.

దీంతో అటార్నీ జనరల్ మాట్లాడుతూ నవంబర్ 11న ఈవిషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తరువాత సెక్రటరీ స్థాయి అధికారితో చర్చలు జరిపామని తెలిపారు. కాగా గతంలో ఈ అంశంపై సుప్రీంకోర్టుకు సహకరించిన సీనియర్ న్యాయవాది వికాస్‌సింగ్, నియామకాల అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన ప్రకటనపై మీడియా కథనాలను ప్రస్తావించారు. మరోసారి నివేదికలను ప్రస్తావించగా పత్రిక కథనాలను విస్మరించినట్లు జస్టిస్ కౌల్ తెలిపారు. అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా ఈవిషయంపై హాజరువుతున్నారని బెంచ్ తెలిపింది. అయితే డబుల్ బారెల్ గన్ పనిచేయాలని గంభీర వాతావరణాన్ని తేలికపరస్తూ బెంచ్ వ్యాఖ్యానించింది. కొన్ని హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను కొలీజియం సిఫా ర్సు చేస్తుంది. కానీ సిఫార్సులు పెండింగ్‌లో ఉన్నాయి. న్యాయవ్యవస్థ తరఫున దీనిపై నిర్ణయం తీసుకునేలా మమ్మల్ని చేయొద్దని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ కీలకపాత్ర పోషించాలి
అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ప్రభుత్వానికి సలహాఇచ్చి సమస్యను పరిష్కరించడంలో కీలకపాత్ర పోషిస్తారని భావిస్తున్నామని తెలుపుతూ బెంచ్ తదుపరి విచారణను డిసెంబర్ 8కు వాయిదా వేసింది. కాగా నవంబర్ 11న జడ్జిల నియామకంలో కేంద్రం జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ కొలీజియం సిఫార్సులు చేసినవారి పేర్లును పెండింగ్‌లో ఉంచడం ఆమోదయోగ్యం కాదని కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ కార్యదర్శి, పాలన నియామక విభాగ అదనపు కార్యదర్శి తమ సమాధానం తెలపాల్సిందిగా జారీ చేసింది. కాగా బెంగళూరు న్యాయవాదుల సంఘం తరఫున న్యాయవాది పాయ్ అమిత్ సుప్రీంకోర్టులో హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంలో తీవ్రజాప్యంపై పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం వైఖరి న్యాయవ్యవస్థ స్వతంత్రకు హానికరమని పిటిషన్‌లో పేర్కొన్నారు. కొలీజియం సిఫార్సు చేసిన అనంతరం మరోసారి పునరుద్ఘాటించిన 11పేర్లును పిటిషన్లో న్యాయవాది ఉదాహరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని నిర్ణయాన్ని అమలుచేయడంలో కేంద్రం విఫలమవుతుందని, సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా పిటిషనర్ ఆరోపించారు. కాగా గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు మూడు నాలుగు వారాల వ్యవధిలో కొలీజియం పునరుద్ఘాటించినవారిని జడ్జిలుగా నియామించాలని ఆదేశించింది. ప్రభుత్వానికి రిజర్వేషన్లు ఉంటే వివరాలను కొలీజియానికి పంపవచ్చని పేర్కొంది. నిర్దిష్ట కారణాలతో కొలీజియం వద్దకు పంపాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది.

న్యాయమూర్తుల ఎంపిక ఫైళ్లు వెనక్కి..

హైకోర్టు జడ్జిల నియామకానికి సంబంధించిన 20 ఫైళ్లను కేంద్ర ప్రభు త్వం సుప్రీంకోర్టు కొలీజియంకు తిరిగి పంపించింది. జడ్జీల ఎంపికను తిరిగి పరిశీలించాల్సి ఉందని తెలిపింది. తాను గే అయినందు వల్లనే జడ్జిగా నియమించడంలేదని పేర్కొన్న న్యాయవాది సురభ్ కిర్పాల్ ఫైల్ కూడా ఈ 20 ఫైళ్లలో ఉందని వెల్లడైంది. ఈ నెల 25వ తేదీనే ఈ ఫైళ్లను కేంద్రం సుప్రీంకోర్టుకు రిటర్న్ చేసిందని సో మవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. కొలీజియం సిఫార్సు చేసిన పేర్ల పట్ల తా ము తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు రిటర్న్ అ యిన మొత్తం 20 ఫైళ్లలో 11 మంది పేర్లు కొత్తవని, మిగిలిన తొమ్మిది ఇంతకు ముం దు సుప్రీంకోర్టు కొలీజియం నిర్థారించినవే అని న్యాయమూర్తుల నియామక ప్రక్రియ విషయాల వర్గాలు తెలిపాయి. ఇప్పుడు జడ్జిగా సిఫార్సు అయి ఆగిన వారిలో ఉన్న వ్యక్తులలో సురభ్ కిర్పాల్ విషయం చాలా వరకూ వివాదాస్పదం అయింది. ఆయన దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి బిఎన్ కిర్పాల్ కుమారుడు. 2017లోనే కిర్పాల్ ను జడ్జిగా నియమించాలని హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అయితే మూడుసార్లు సుప్రీంకోర్టు ఆయన పేరు పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది.

అయితే తన లైంగిక కోణంలోని అంశాలతోనే తనపేరును వ్యతిరేకించారని, తాను గే అయినందునే న్యాయమూర్తిని కాలేకపోతున్నానని ఇటీవలే కిర్పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. కిర్పాల్‌ను ఢిల్లీ హైకోర్టు జడ్జిగా తీసుకోవాలని ఇంతకు ముందటి ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ సారధ్యపు కొలీజియం కూడా సిఫార్సు చేసింది. అంతకు ముందటి కొలీజియం కూడా కిర్పాల్ గురించి మరింత సమాచారం కావాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే ఇప్పటి సిఫార్సుల పట్ల తమకు పూర్తి స్థాయిలో అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంటూ సంబంధిత ఫైళ్లను కొలీజియం వద్దకు ప్రభుత్వం తిప్పి పంపించడం వివాదాస్పదం అయింది. ఓ వైపు కొలీజియం ప్రక్రియనే సరిగ్గా లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజూ పలు వేదికల నుంచి పేర్కొనడం, దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుంచి విమర్శలు తలెత్తడం వంటి పరిణామాల నడుమ ఈ ఫైళ్ల రిటర్న్ మరింత చిచ్చు రగిల్చింది

Supreme Court warns Centre for delaying Judges appointment

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News