Tuesday, November 5, 2024

భవనాల కూల్చివేతపై మార్గదర్శకాలు జారీ చేస్తాం

- Advertisement -
- Advertisement -

సుప్రీం కోర్టు ప్రకటన
ఇళ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా పిటిసన్లపై తీర్పు రిజర్వ్

న్యూఢిల్లీ : భవనాల కూల్చివేతల అంశంపై పౌరులు అందరికీ తాము మార్గదర్శక సూత్రాలు జారీ చేస్తామని సుప్రీం కోర్టు మంగళవారం ప్రకటించింది. నేర నిందితుల ఇళ్లతో సహా ఆస్తులను పలు రాష్ట్రాల్లో కూల్చివేస్తున్నారనే ఆరోపణలతో దాఖలైన పిటిషన్లపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. తన ఆదేశాలు దేశం అంతటికీ వర్తిస్తాయని సర్వోన్నత న్యాయస్థానం చెబుతూ, ఒక వ్యక్తి నిందితుడు లేదా నిర్ధారిత దోషి కావడం ఆస్తి కూల్చివేతకు కారణం కాజాలదని స్పష్టం చేసింది.

‘మేము ఏది నిర్దేశిస్తున్నా మనది సెక్యులర్ దేశం. ఏ ఒక్క వర్గానికో కాకుండా పౌరులు అందరికీ, సంస్థలు అన్నిటికీ మేము ఉత్తర్వు జారీ చేస్తున్నాం’ అని న్యాయమూర్తులు బి ఆర్ గవాయ్, కె వి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. ఒక ప్రత్యేక మతానికి వేరే చట్టం ఉండదని బెంచ్ స్పష్టం చేస్తూ, సార్వత్రిక రోడ్డు, ప్రభుత్వ స్థలాలు లేదా అడవుల్లో అనధికార నిర్మాణాలను తాము కాపాడబోమని తెలిపింది. ‘ఏ సార్వత్రిక స్థలాల్లోనైనా కబ్జాదారులకు మా ఉత్తర్వు ఉపయుక్తం కాకుండా మేము జాగ్రత్త పడతాం’ అని బెంచ్ తెలియజేసింది. ఈ విషయంలో విచారణ పూర్తి అయిన తరువాత ‘ఉత్తర్వుల కోసం మూసివేయడమైంది’ అని బెంచ్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News