Monday, November 25, 2024

జిహెచ్ఎంసిలో హౌజింగ్ సొసైటీలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషఫన్(జిహెచ్ఎంసి) పరిధిలో హౌజింగ్ సొసైటీలపై సుప్రీంకోర్టు సోమవారం(నవంబర్ 25న) సంచలన తీర్పు ఇచ్చింది. హౌజింగ్ సొసైటీలకు ఇప్పటికే కేటాయించిన భూములను భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. ఇంతేకాకుండా సొసైటీలు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

హౌజింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూకేటాయింపులను సవాలు చేస్తూ రావు బి చెలికాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయుల(జర్నలిస్టుల) సొసైటీలకు ప్రభుత్వం గతంలో భూకేటాయింపులు చేసింది. అయితే అవి ఈ తీర్పుతో చెల్లనేరవు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News