న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక చట్టం(ఉపా) కింద అరెస్టైన న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని.. రిమాండ్ కాపీ కూడా అందించలేదని న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం బుధవారం ప్రబీర్ అరెస్టును తప్పు బట్టింది. ఎందుకు అరెస్టు చేశారన్న విషయాలను న్యాయస్థానికి వెల్లడించలేదని.. రిమాండ్ ఆర్డర్ చెల్లదని జస్టిన్ మోహతా చెప్పారు. కాబట్టి.. పంకజ్ బన్సల్ కేసు తరహాలో ప్రబీర్ ను కస్టడి నుంచి విడుదల చేయాలని ఆదేశించారు.
కాగా, చైనా నుంచి నిధులు తీసుకుని ఆ దేశ ఏజెండా గురించి.. న్యూస్ క్లిక్ సంస్థ అనుకూలంగా కథనాలు ప్రచురించినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆరపణలు చేసింది. దీంతో ఉగ్రవాద నిరోధక చట్టం(ఉపా) కింద గత ఏడాది అక్టోబర్ 3న ప్రబీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.